ICC Awards 2021 : గత ఏడాది 2021కి సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వివిధ ఫార్మాట్ లకు సంబంధించి పలు అవార్డుల జాబితాను ఇవాళ విడుదల చేసింది. ఈ అవార్డులలో దాయాది పాకిస్తాన్ ప్లేయర్లు దుమ్ము రేపారు.
పురుషుల వన్డే అత్యుత్తమ ప్లేయర్ గా పాకిస్తాన్ స్కిప్పర్, ఓపెనర్ బాబార్ ఆజమ్ ఎంపికయ్యాడు. టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్(ICC Awards 2021) గా వికెట్ కీపర్ రిజ్వాన్ ను సెలెక్టు చేసింది ఐసీసీ. ఇక క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా షాహీన్ అఫ్రిదిని వరించింది.
ఇక ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఇదే పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్ ఫాతిమా సనా గెలుచుకుంది. మరో వైపు ఐసీసీ పూర్తిగా డిక్లేర్ చేసిన వన్డే, టీ20 జట్లకు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ను నాయకుడిగా ఎంపిక చేసింది ఐసీసీ.
ఇక ఈ రెండు టీమ్ లలో భారత స్టార్ ప్లేయర్లకు చోటు దక్కలేదు. ఇదిలా ఉండగా ఒక్క ఐసీసీ ప్రకటించిన టెస్టు టీమ్ లో ముగ్గురు ఆటగాళ్లకు ప్లేస్ లభించింది.
ఇందులో భారత స్టార్ ప్లేయర్, స్కిప్పర్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ , స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఎంపిక చేసింది. ఇక పురుషుల, మహిళల విభాగాల్లో గత ఏడాది అద్భుతమైన పర్ ఫార్మెన్స్ కనబర్చిన ఆటగాళ్లను ఐసీసీ ఎంపిక చేసింది.
వారిలో ఒక్క భారతీయ క్రీడాకారిణి స్మృతీ మంధాన మాత్రమే ఎంపికైంది. మూడు ఫార్మాట్ లలో సత్తా చాటినందుకు గాను ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు(ICC Awards 2021) లభించింది.
Also Read : అంపైర్ ఆఫ్ ది ఇయర్ గా ఎరాస్మస్