IPL 2023 : 15 లోగా రిటైన్ ఆటగాళ్ల జాబితా ఇవ్వాలి
జట్ల ఫ్రాంచైజీలకు ఐపీఎల్ ఆల్టిమేటం
IPL 2023 : ఇండియన్ ప్రిమీయం లీగ్ (ఐపీఎల్) వచ్చే ఏడాది 2023లో(IPL 2023) నిర్వహించేందుకు గాను ముందస్తుగా చర్యలు ప్రారంభించింది బీసీసీఐ. డిసెంబర్ 16న మెగా వేలం పాట చేపట్టేందుకు నిర్ణయించినట్లు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ. ఇప్పటికే రాష్ట్రాల సంస్థలకు లేఖ రాశారు.
ఇందులో భాగంగా ముందుస్తాగా ఐపీఎల్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ ఆటగాళ్ల జాబితాలు సమర్పించాలని కోరింది. నవంబర్ 15 లోగా డెడ్ లైన్ విధించింది ఐపీఎల్. ప్రస్తుతం 10 జట్లు పాల్గొంటున్నాయి ఐపీఎల్ లో. ఐపీఎల్ తదుపరి ఎడిషన్ కోసం బీసీసీఐ బాల్ రోలింగ్ ను సెట్ చేసిందని ఫ్రాంచైజీ అధికారి ఒకరు వెల్లడించారు.
వచ్చే సీజన్ లో జీతాల పరిమితిని కూడా రూ. 90 నుంచి రూ. 95 కోట్లకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా చిన్న వేలంలో ఫ్రాంచైజీలు గత మెగా వేలం సమయంలో వారు ఖర్చు చేసిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ మొత్తంతో వేలం పూల్ కు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఆటగాళ్లను విడుదల చేసిన తర్వాత వారు పొందిన మొత్తంతో ఆటగాళ్ల వేలం వేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా ఫ్రాంచైజీలు 15 మంది ప్రధాన ఆటగాళ్లను ఉంచుకుని మిగిలి వారిని కనీసం రూ. 10 కోట్లతో వేలంలోకి ప్రవేశించేందుకు విడుదల చేస్తారని భావిస్తున్నారు. గత వేలం పాట తర్వాత పంజాబ్ కింగ్స్ , చెన్నై సూపర్ కింగ్స్ వద్ద వరుసగా రూ. 3.45 , రూ. 2.95 కోట్లు మిగిలి ఉన్నాయి.
ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలో డబ్బులు పూర్తిగా అయిపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్ , ముంబై ఇండియన్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ గత సీజన్ నుండి రూ. 10 లక్షలు మిగిలి ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ లో రూ. 15 లక్షలు, కేకేఆర్ వద్ద రూ. 45 లక్షలు మిగిలి ఉండగా రాజస్థాన్ రాయల్స్ జట్టు వద్ద వారి పర్స్ లో రూ. 95 లక్షలు ఉన్నాయి. ఆర్సీబీ వద్ద రూ. 1.55 కోట్లు మిగిలి ఉన్నాయి.
Also Read : డిసెంబర్ 16న ఐపీఎల్ మెగా వేలం