K Viswanath : తెలుగు సినిమా రంగమే కాదు భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిలో నిలిచి పోయిన దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్. ఇవాళ ఆయన పుట్టిన రోజు. ఏపీ లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పులివర్రులో 1930 ఫిబ్రవరి 19న పుట్టారు.
ఆయన వయస్సు 92 ఏళ్లు. విశ్వనాథ్ దర్శకుడు మాత్రమే కాదు నటుడు, రచయిత, సౌండ్ రికార్డిస్టుగా పేరొందారు. కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిరకాలం గుర్తుంచుకునేలా సినిమాలను తీశారు విశ్వనాథ్(K Viswanath ).
తెలుగు సినిమా గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసేలా కృషి చేశారు. మొదటగా సౌండ్ రికార్డిస్టుగా సినీ రంగదంలోకి ఎంటరయ్యారు.
ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్లు సహాయ దర్శకుడిగా పని చేశారు విశ్వనాథ్.
అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన ఆత్మ గౌరవం సినిమాతో ఆయన దర్శకుడిగా తన కెరీర్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాకు నంది పురస్కారం లభించింది.
ఇక విశ్వనాథ్ పేరు దేశ వ్యాప్తంగా గుర్తు పెట్టుకునేలా చేసింది మాత్రం శంకరాభరణం చిత్రం. జాతీయ పురస్కారం గెలుచుకుంది.
ఆ తర్వాత కమల్ హాసన్, జయప్రదతో తీసిన సాగర సంగమం చరిత్ర తిరగ రాసింది.
శృతి లయలు, సిరి వెన్నెల, స్వర్ణ కమలం, స్వాతి కిరణం సినిమాలు తెలుగు వారిని ఆకట్టుకున్నాయి.
ఆలోచింప చేసేలా చేశాయి. ఇప్పటికీ ఆ సినిమాలు అలరారుతూనే ఉన్నాయి.
సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ విశ్వనాథ్ (K Viswanath )తీసిన చిత్రాలలో సప్తపది, స్వాతి ముత్యం, స్వయం కీషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం ముఖ్యమైనవి.
అనంతరం శుభ సంకల్పం, నరసింహ నాయుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఠాగూర్ , అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్ ఫెక్ట్ , కలిసుందాం రా చిత్రాలలో విశ్వనాథ్ నటించారు.
సినీ రంగానికి చేసిన కృషికి గాను 2016లో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ , కళాతపస్వి అవార్డులు పొందారు.
సిరిసిరిమువ్వ సినిమా విశ్వనాథ్ కు గొప్ప పేరు తీసుకు వచ్చింది. పాశ్చాత్యా సంగతపు హోరులో కొట్టుకు పోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికే పూర్వ వైభవాన్ని పునః స్థాపించాలనే ఉద్దేశాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు.
శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా అవార్డు లభించింది. స్వాతిముత్యం 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది.
ఆయన సినిమాలలో సంగీతానికే ప్రయారిటీ ఇచ్చారు. కేవీ మహదేవన్ , ఇళయరాజా పనిచేశారు.
Also Read : కేసీఆర్ టార్చ్ బేరర్