Lok Sabha Results : లైంగిక వేధింపుల కేసులో సంచలనం సృష్టించిన రేవన్న ఓటమి దిశగా

హాసన్ నియోజకవర్గం 25 ఏళ్లుగా జేడీఎస్ కంచుకోటగా ఉంది...

Lok Sabha Results : వివాదాస్పద లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న జేడీఎస్ నేత, హాసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఇది పెద్ద దెబ్బ. హాసన్ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసిన ఆయన సమీప కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ పటేల్ చేతిలో 40,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ్వల్ తండ్రి హెచ్‌డి రేవణ్ణపై శ్రేయాస్ పటేల్ పోటీ చేసి ఓడిపోయారు.

Lok Sabha Results..

హాసన్ నియోజకవర్గం 25 ఏళ్లుగా జేడీఎస్ కంచుకోటగా ఉంది. ప్రజ్వల్ రేవణ్ణ ఓటమితో నియోజకవర్గంలో తొలిసారిగా జేడీఎస్ పట్టు కోల్పోయింది. 2019 ఎన్నికల్లో ప్రజ్వల్ అదే హసన్ నియోజకవర్గం నుంచి 1.4 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Also Read : Nara Lokesh : మంగళగిరిలో విజయం సాధించిన నారా లోకేష్

Leave A Reply

Your Email Id will not be published!