lokesh Kanagaraj Visit : శ్రీ‌వారి సేవ‌లో లోకేష్ క‌న‌గ‌రాజ్

తిరుమ‌లను ద‌ర్శించుకున్న డైరెక్ట‌ర్

lokesh Kanagaraj Visit : తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. ఆ దేవ దేవుడు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని కొలువ‌ని భ‌క్తుడంటూ ఉండ‌రు. ప్ర‌త్యేకించి సినిమా రంగానికి సంబంధించి ప్ర‌తి ఒక్క‌రు స్వామి వారిని ద‌ర్శించు కోవ‌డం, మొక్కులు తీర్చుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. స్వామి వారి ఆశీర్వాదం ఉంటే చాలు త‌మ సినిమాలు స‌క్సెస్ అవుతాయ‌ని న‌మ్మ‌కం.

lokesh Kanagaraj Visit Tirumala with his team

తాజాగా త‌మిళ సినీ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్(lokesh Kanagaraj) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లియో సినిమా అక్టోబ‌ర్ 19న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అవుతోంది. ఇప్ప‌టికే మూవీ మేక‌ర్స్ పోస్ట‌ర్స్ , టీజ‌ర్ , ట్రైల‌ర్ , సాంగ్స్ విడుద‌ల చేశారు. భారీ ఆద‌ర‌ణ చూర‌గొన్నాయి.

ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించింది త‌ళ‌ప‌తి విజ‌య్ , త్రిష కృష్ణ‌న్. భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి లియో సినిమాపై. జోసెఫ్ ఇమేజ్ మ‌రింత పెంచేలా ద‌ర్శ‌కుడు లోకేష్ ప్ర‌య‌త్నం చేశాడ‌ని టాక్. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో గ‌తంలో మాస్ట‌ర్ మూవీ వ‌చ్చింది. అది బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంగా నిలిచింది.

త‌ను తీసిన లియో చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌ని కోరుతూ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌న టీంతో క‌లిసి గురువారం తిరుమ‌ల‌కు విచ్చేశారు. వారంతా తిరుమ‌ల‌కు కాలి న‌డ‌క‌న రావ‌డం విశేషం. ఈ సంద‌ర్బంగా టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.

Also Read : Joe Biden Warning : ఇరాన్ పై బైడెన్ క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!