Joe Biden Warning : ఇరాన్ పై బైడెన్ క‌న్నెర్ర‌

జ‌ర జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వార్నింగ్

Joe Biden Warning : అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇజ్రాయెల్ – హ‌మాస్ ఉగ్ర‌వాదుల మ‌ధ్య భీక‌ర పోరు కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ న‌ష్టం చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం మేర‌కు క‌నీసం 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Joe Biden Warning to Iran President

మ‌రో వైపు 17 వేల మందికి పైగా తీవ్ర గాయాల పాల‌య్యారు. యావ‌త్ ప్ర‌పంచం నెత్తీ నోరు బాదుకుంటోంది యుద్దం ఆపేయాల‌ని. కానీ హ‌మాస్ ఉగ్ర మూకలు ప‌ట్టించు కోవ‌డం లేదు.

భారీ ఎత్తున దాడుల‌కు పూనుకుంటున్నారు. దీంతో ఇజ్రాయెల్ అప్ర‌మ‌త్త‌మైంది. ప్ర‌స్తుతానికి తాము ఊరుకుని ఉన్నా త‌ర్వాత ప్ర‌పంచంలో ఎక్క‌డ ఉన్నా లేదా దాక్కున్నా బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చి ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ఇజ్రాయెల్ దేశాధ్య‌క్షుడు హెచ్చ‌రించారు.

దీనిపై తీవ్రంగా స్పందించారు అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్(Joe Biden). ఇజ్రాయెల్ పై ఏక‌ప‌క్షంగా రాకెట్ల‌తో విరుచుకు ప‌డిన హ‌మాస్ ఉగ్ర మూక‌ల‌కు అన్ని ర‌కాలుగా ఇరాన్ స‌హాయ స‌హ‌కారాలు అందిస్తోంద‌ని యుఎస్ తో పాటు ఇజ్రాయెల్ కూడా అనుమానం వ్య‌క్తం చేస్తోంది. దీంతో అమెరికా స్వ‌యంగా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ కు స‌పోర్ట్ గా యుద్ద విమానాల‌ను మోహ‌రించింది. ఒక‌వేళ నిజ‌మ‌ని తేలితే యుద్దం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు బైడెన్.

Also Read : TTD Darshan Tickets : 18న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు

Leave A Reply

Your Email Id will not be published!