Republic Day : సమున్నత భారతం ఇవాళ 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రతి ఏటా జనవరి 26న దినోత్సవాన్ని జరుపు కోవడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రతి ఏటా లాగానే ఇవాళ భారత దేశ అత్యున్నత పదవిని అలంకరించిన రాష్ట్రపతి న్యూఢిల్లీలోని ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తారు.
రిపబ్లిక్ డే (Republic Day )సందర్భంగా భారత దేశ సైనిక శక్తిని ప్రదర్శిస్తారు.
ప్రతి దేశానికి ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంటుంది. ఎందరో వీరుల త్యాగం, బలిదానాల సాక్షిగా భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది.
అనంతరం దేశానికి దిశా నిర్దేశం చేసేందుకు, దేశంలోని ప్రతి ఒక్కరు స్వేచ్చాయుతంగా బతికేందుకు కావాల్సిన రక్షణ, చట్టాలు, హక్కుల గురించి పొందు పర్చినదే రాజ్యాంగం.
1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించడంతో ఆనాటి నుంచి దేశం గణతంత్ర రాజ్యాంగా(Republic Day )అవతరించింది.
భారత దేశం ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొందిన సార్వభౌమ దేశంగా ఏర్పాటైంది.
ప్రధాన ఆకర్షణలలో కవాతు ఒకటి. న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లో ప్రారంభమై ఇండియా గేట్ వద్ద ముగుస్తుంది.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించారు రాజ్యాంగాన్ని. ఇది దేశం అత్యున్నత చట్టంగా మిగిలి పోయింది.
ఏ దేశమైనా పౌరుల హక్కులను, దేశాన్ని నడిపించే సూత్రాలను పరిరక్షించేందుకు దేశానికి స్వతంత్ర రాజ్యాంగం అన్నది అత్యవసరం.
భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి న్యాయ శాఖ మంత్రి, భారతీయ ప్రధాన వాస్తు శిల్పి, రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదాను రూపొందించారు.
ఒక రకంగా చెప్పాలంటే ఈ రాజ్యాంగమే దేశాన్ని పాలిస్తుంది. 1947 ఆగస్టు 29న శాశ్వత భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ముసాయిదా కమిటీని నియమించారు.
దీనికి అంబేద్కర్ చైర్మన్ గా ఉన్నారు. దేశాన్ని సార్వభౌమ గణతంత్రంగా ప్రకటించే రోజుగా జనవరి 26న ఎంచుకున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రసిద్ది చెందిన భారత స్వాతంత్ర ప్రకటన చేసింది.
1950లో ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థతో అమలులో వచ్చినప్పటికీ దీనిని 26 నవంబర్ 1949 న భార రాజ్యాంగ సభ ఆమోదించింది. సార్వ భౌమ గణతంత్ర రాజ్యంగా దేశం పరివర్తనను పూర్తి చేసింది.
ఇదిలా ఉండగా రాజ్యాంగ ముసాయిదా 1947 నవంబర్ 4న భారత రాజ్యాంగ సభకు సమర్పించారు. 166 రోజుల వ్యవధిలో రెండు సంవత్సరాలలో 308 మంది ఇందులో పాల్గొని సవరణలు చేశారు.
1950 జనవరి 24న రాజ్యాంగం రెండు చేతి రాత కాపీలపై సంతకాలు చేశారు. ఒకటి ఆంగ్లంలో రెండోది హిందీలో. భారత యూనియన్ చీఫ్ గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదటి పదవీ కాలం ప్రారంభమైంది.
కొత్త రాజ్యాంగంలోని పరివర్తన నిబంధనల ప్రకారం రాజ్యాంగ సభ భారత పార్లమెంట్ గా మారింది.
Also Read : చతేశ్వర్ పుజారా వెరీ స్పెషల్