Sidhu Moosewala : సిద్దూ హత్య కేసులో లుక్ అవుట్ నోటీసు
కస్టడీ నుంచి తప్పించుకున్న నిందితులు
Sidhu Moosewala : పంజాబ్ సింగర్ హత్యలో కస్టడీ నుంచి తప్పించుకున్న నిందితుల కోసం లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. గత రాత్రి పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న ప్రధాన నిందితుల్లో ఒకడైన దీపక్ తినుపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. మే 29న పంజాబ్ లోని మాన్సా జిల్లాలో సిద్దూ మాసే వాలాపై కాల్పులు జరిగాయి.
పోలీసుల కస్టడీ నుంచి గ్యాంగ్ స్టర్ దీపక్ తిను తప్పించు కోవడంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సీరియస్ గా స్పందించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann) . ఈ కేసుకు సంబంధించి లుక్ అవుట్ నోటీసు జారీ చేశామని, అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.
గాయకుడు సిద్దూ మూసే వాలా హత్య కేసులో నిందితుల్లో ఒకడైన టిను మాన్సా పోలీసులకు సంబంధించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ) యూనిట్ కస్టడీ నుండి తప్పించుకున్నాడు. పంజాబ్ శాసన సభ ముగింపు రోజున విశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొన్నారు సీఎం భగవంత్ మాన్.
గ్యాంగ్ స్టర్ పై లుక్ అవుట నోటీసు జారీ చేశామని టినును పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతోందని స్పష్టం చేశారు. అతడిపై కేసు కూడా నమోదు చేశామన్నారు. అతడిని అక్టోబర్ 7 వరకు రిమాండ్ పై కోర్టు పంపిందన్నారు. సిద్దూ మూసే వాలా(Sidhu Moosewala) హత్య కేసుపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటి వరకు కేసుకు సంబంధించి 36 మందిపై కేసు నమోదైందని 28 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు భగవంత్ మాన్. కాంగ్రెస్, అకాలీదళ్ లు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలోని గ్యాంగ్ స్టర్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
Also Read : పీకే సర్టిఫికేట్ తమ పార్టీకి అక్కర్లేదు