Kalpavruksha Vahana : క‌ల్ప‌వృక్ష వాహ‌నంపై తేజోమూర్తి

వైభ‌వంగా శ్రీ గోవింద రాజ స్వామి ఉత్స‌వం

Kalpavruksha Vahana : క‌ల్ప‌వృక్ష వాహ‌నంపై ద‌ర్శ‌నం ఇచ్చారు తిరుప‌తి లోని శ్రీ గోవింద రాజ స్వామి వారు. బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌తి రోజూ ప్ర‌త్యేకంగా పూజ‌లు కొన‌సాగుతున్నాయి. నాలుగో రోజు సోమవారం స్వామి వారు శ్రీ‌దేవి, భూదేమి స‌మేత క‌ల్ప‌వృక్ష వాహ‌నంపై(Kalpavruksha Vahana) భ‌క్తుల‌ను క‌టాక్షించారు. ఉద‌యం 7 గంట‌ల నుండి 9 గ‌గంట‌ల వ‌ర‌కు వాహ‌న సేవ వైభవోపేతంగా జ‌రిగింది. వాహ‌నం ముందు గ‌జ‌రాజులు న‌డుస్తుండ‌గా భ‌క్త జ‌న బృందాలు కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాల న‌డుమ క‌ర్పూర హార‌తులు స‌మ‌ర్పించారు స్వామి వారికి.

ప్ర‌కృతికి శోభ‌ను చేకూర్చేది చెట్టు. అనేక విధాలైన చెట్లు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి క‌ల్ప వృక్షం. ఇత‌ర చెట్లు త‌మ‌కు కాచిన ఫ‌లాల‌ను మాత్ర‌మే ప్ర‌సాదిస్తాయి. కానీ క‌ల్ప‌వృక్షం(Kalpavruksha Vahana) వాంచిత ఫ‌లాల‌ను అన్నింటినీ ప్ర‌సాదిస్తుంది. స‌ముద్ర మ‌థ‌నంలో సంక‌ల్ప వృక్షంగా ఆవిర్భ‌వించిందే ఈ దేవ‌తా వృక్షం క‌ల్ప‌వృక్షం. భ‌క్తుల కోరిక‌ల‌ను తీర్చే దేవ దేవుడుగా శ్రీ గోవింద రాజ స్వామి వారు మ‌న్న‌న‌లు అందుకుంటున్నారు.

అనంత‌రం ఉద‌యం 9.30 గంట‌ల నుండి 10.30 గంట‌ల దాకా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద రాజ స్వామి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం వేడుక‌గా నిర్వ‌హించారు. సాయంత్రం 5.30 గంట‌ల నుండి 6 గంట‌ల వ‌ర‌కు స్వామి వారి ఊంజ‌ల్ సేవ వైభ‌వంగా కొన‌సాగింది. రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు స‌ర్వ భూపాల వాహ‌నంపై స్వామి వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు.

 

Leave A Reply

Your Email Id will not be published!