Brendon Mccullum : ‘గిల్’ ను కోల్పోవ‌డం బాధాక‌రం

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ హెడ్ కోచ్

Brendon Mccullum  : త‌మ జ‌ట్టు నుంచి శుభ్ మ‌న్ గిల్ ను కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నాడు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ హెడ్ కోచ్ బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్(Brendon Mccullum ). ఐపీఎల్ త‌ర‌పున కేకేఆర్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు.

మొత్తం 58 మ్యాచ్ లు ఆడి 17 ఇన్నింగ్స్ ల‌లో 478 ప‌రుగులు చేసి స‌త్తా చాటాడు. ఎక్కువ ర‌న్స్ చేసిన బ్యాట‌ర్ల లిస్టులో మ‌నోడు ఎనిమిదో ప్లేస్ లో ఉన్నాడు.

ఇక ఐపీఎల్ మెగా వేలం ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీల‌లో బెంగ‌ళూరు వేదిక‌గా కొన‌సాగ‌నుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఇక ఆయా జ‌ట్లు మంచి ప్లేయ‌ర్ల‌ను వ‌దులుకున్నాయి. ఇందులో భాగంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో కేకేఆర్ అద్భుతంగా ఆడినా ఎందుక‌నో శుభ్ మ‌న్ గిల్ ను వ‌దులు కోవ‌డాన్ని జీర్ణించు కోలేక పోతున్నాడు హెడ్ కోచ్.

విచిత్రం ఏమిటంటే హెడ్ కోచ్ అభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా కేకేఆర్ యాజ‌మాన్యం ఎలా అత‌డిని వ‌దులుకుంద‌నే విష‌యాన్ని చెప్ప‌లేక పోయాడు మెక‌ల్ల‌మ్(Brendon Mccullum ).

అన్ని ఫార్మాట్ ల‌లో గిల్ అద్భుత ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచాడు. భ‌విష్య‌త్తులో కేకేఆర్ టీంకు నాయ‌కుడు అవుతాడ‌ని కూడా అంతా అనుకున్నారు.

కానీ ఉన్న‌ట్టుండి వ‌దులు కోవ‌డంతో ఐపీఎల్ లో కొత్త‌గా చేరిన అహ్మ‌దాబాద్ ఫ్రాంచైజీ శుభ్ మ‌న్ గిల్ ను స్వంతం చేసుకుంది. రూ. 8 కోట్లు వెచ్చించిన‌ట్లు స‌మాచారం.

త‌మ టీమ్ లో అత‌డిని ఓపెన‌ర్ కోసం తీసుకున్న‌ట్లు తెలిపింది. సునీల్ స‌రైన్ , శుభ్ మ‌న్ గిల్ లు అద్భుతంగా రాణించార‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసించాడు.

Also Read : నేస్త‌మా నీ విజ‌యం అద్భుతం

Leave A Reply

Your Email Id will not be published!