Ram Kadam Love Zihad : తునీషా సూసైడ్ వెనుక లవ్ జిహాద్
బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ఆరోపణ
Ram Kadam Love Zihad : లవ్ జిహాద్ అన్నది మరోసారి హాట్ టాపిక్ గా మారింది. యువ నటి తునీషా శర్మ శనివారం సీరియల్ షూటింగ్ సమయంలో బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. సహ నటుడు షీజాన్ ఖాన్ ప్రమేయం ఉందంటూ తునీషా శర్మ తల్లి ఆరోపించింది.
ఈ మేరకు పోలీసులు అతడిని ఆదివారం ఉదయం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. గత కొంత కాలం నుంచి తునీషా శర్మ, షీజాన్ ఖాన్ ప్రేమించుకుంటున్నారు. గత 15 రోజుల కిందట ప్రేమకు బ్రేకప్ చెప్పాడు షీజాన్ ఖాన్ . దీంతో తట్టుకోలేక తునీషా శర్మ సూసైడ్ కు పాల్పడిందని పోలీసులు నిర్దారణకు వచ్చారు.
కోర్టులో హాజరు పరిచారు. నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఈ సంద్భంగా తునీషా శర్మ ఆత్మహత్య వెనుక లవ్ జిహాద్ ఉందంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రామ్ కదమ్ (Ram Kadam) ఆరోపించారు. ఏది ఏమైనా ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
నటి తునీషా శర్మ మరణం వెనుక ఏదైనా లవ్ జిహాద్ కోణం గనుక ఉంటే పోలీసులు దానిపై దర్యాప్తు చేస్తారని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటారని చెప్పారు రామ్ కదమ్. నిందితులను వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. వంద శాతం న్యాయం జరిగేలా చూస్తామన్నారు ఎమ్మెల్యే. కాగా హత్య లేదా ఆత్మహత్య అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా రామ్ కదమ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : నటుడు షీజాన్ ఖాన్ అరెస్ట్