LSG Retention List : ఈసారైనా లక్నోకు లక్ కలిసొస్తుందా
ఏడుగురిని వదులుకున్న లక్నో జెయింట్స్
LSG Retention List : ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ 2022లో పేలవమైన ఆట తీరుతో నానా విమర్శలు ఎదుర్కొన్న ఏకైక క్రికెటర్ కేఎల్ రాహుల్. అటు ఓపెనర్ గా ఇటు ఫీల్డర్ గా నిరాశ పరిచాడు. ఒకానొక దశలో అతడిని ఎందుకు ఎంపిక చేశారంటూ పెద్ద ఎత్తున తాజా, మాజీ క్రికెటర్లు మండిపడ్డారు.
ఈ తరుణంలో మరోసారి లక్నో జెయింట్స్ మేనేజ్ మెంట్ కేఎల్ రాహుల్ ను అలాగే తమ జట్టుకు కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఒకానొక దశలో కేఎల్ ను వదులు కుంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ రిటైన్(LSG Retention List) , రిలీజ్ జాబితాను ప్రకటించింది.
నవంబర్ 15న అన్ని జట్లకు డెడ్ లైన్ విధించడంతో తమ లిస్టులను విడుదల చేశాయి. అత్యధికంగా కోల్ కతా నైట్ రైడర్స్ మేనేజ్ మెంట్ ఏకంగా 16 మందిని విడుదల చేసింది. ఇక ముంబై ఇండియన్స్ 13 మందిని, పంజాబ్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు సైతం పెద్ద ఎత్తున వదులుకున్నాయి.
ఒక రకంగా గతంలో జరిగిన వేలం పాటలో కంటే ఈసారి అత్యధికంగా ప్లేయర్లను విడుదల చేయడం విస్తు పోయేలా చేసింది ఫ్యాన్స్ ను. ఇక బీజేపీకి చెందిన క్రికెటర్ లక్నో జెయింట్స్ కు కోచ్ గా ఉన్నాడు.
ఈసారి కేఎల్ రాహుల్ కెప్టెన్ కాగా, ఆయుష్ బదోని, మనన్ వోహ్రా, డికాక్ , స్టోయినిస్ , కృష్ణప్ప గౌతమ్ , దీపక్ హూడా, కైల్ మేయర్స్ , కృనాల్ పాండ్యా, ఆవేష్ ఖాన్ , మార్క్ వుడ్ , మయాంక్ యాదవ్ , రవి బిష్ణోయ్ లను ఉంచుకుంది. ఇక ఆండ్రూ టై , అంకిత్ రాజ్ పుత్ , దుష్యంత చమీర, ఎవిన్ లూయిస్ , హోల్డర్ , మనీష్ పాండే , షాబాజ్ నదీమ్ లను రిలీజ్ చేసింది.
Also Read : భారీ ఎత్తున వదులుకున్న ముంబై