LSG vs CSK IPL 2023 : బిగ్ ఫైట్ లో బాద్ షా ఎవ‌రో

చెన్నై ల‌క్నో మ‌ధ్య నువ్వా నేనా

LSG vs CSK IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో బిగ్ ఫైట్ కు సిద్ద‌మ‌య్యాయి బ‌ల‌మైన జ‌ట్లు చెన్నై సూప‌ర్ కింగ్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ . ఇరు జ‌ట్లు ఆఖ‌రి మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలయ్యాయి. విచిత్రం ఏమిటంటే స్వంత మైదానంలో చెన్నైకి కోలుకోలేని షాక్ ఇచ్చింది శిఖ‌ర్ ధావన్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవెన్.

ఇక ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కు(LSG vs CSK IPL 2023) ఫాఫ్ డుప్లెస్ సార‌థ్యంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఊహించ‌ని రీతిలో దెబ్బ కొట్టింది. దీంతో ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే ఈ కీల‌క పోరు అత్యంత కీల‌కం ధోనీ, రాహుల్ కు. ఇక పాయింట్ల ప‌రంగా చూస్తే గుజరాత్ టాప్ లో ఉండ‌గా రెండో స్థానంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , మూడో స్థానంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ , నాలుగో స్థానంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ నిలిచింది.

ఇరు జ‌ట్లు అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ బ‌లంగా ఉన్నాయి. ఐపీఎల్ టోర్నీలో ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ 45వ‌ది కావ‌డం విశేషం. ఇరు జ‌ట్ల మ‌ధ్య మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎలాగైనా స‌రే గెలిచి తీరాల‌ని ధోనీ సేన కృత నిశ్చ‌యంతో ఉండ‌గా ఆర్సీబీతో ఓట‌మిని పాఠంగా మ‌ల్చుకుని చెన్నై సూప‌ర్ కింగ్స్ కు చెక్ పెట్టాల‌ని కేఎల్ రాహుల్ సేన ఉవ్విళ్లూరుతోంది.

Also Read : కోహ్లీ నిర్వాకం ఉల్ హ‌క్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!