LSG vs KKR IPL 2022 : ల‌క్నో సెన్సేష‌న్ కోల్ క‌తా ప‌రేషాన్

75 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ

LSG vs KKR IPL 2022 : ఐపీఎల్15వ సీజ‌న్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 8 జ‌ట్లు ఆడ‌గా ఈసారి రెండు జ‌ట్లు అద‌నంగా చేరాయి. కానీ ఊహించ‌ని రీతిలో టైటిల్ ఫెవ‌రేట్లుగా భావించిన చెన్నై సూప‌ర్ కింగ్స్ , ముంబై ఇండియ‌న్స్ కు చుక్క‌లు చూపించాయి.

హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ , కేఎల్ నాయ‌క‌త్వంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స‌త్తా చాటాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో ఈ రెండు జ‌ట్లు టాప్ లో నిలిచాయి.

దీంతో ప్లే ఆఫ్స్ కు ఈ రెండు జ‌ట్లు అన‌ధికారికంగా చేరుకున్నాయి. లీగ్ మ్యాచ్ లో(LSG vs KKR IPL 2022) భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ పై 75 ప‌రుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.

ప్రారంభంలోనే కెప్టెన్ కేఎల్ రాహుల్ గోల్డెన్ డ‌కౌట్ కే వెనుదిరిగినా క్వింట‌న్ డికాక్ , దీప‌క్ హూడా, స్టాయినిస్ రాణించ‌డంతో భారీ స్కోర్ న‌మోదు చేసింది. ఆపై ల‌క్నో బౌల‌ర్లు ఆవేష్ ఖాన్ , జేస‌న్ హోల్డ‌ర్ల్ ధాటికి కోల్ క‌తా చాప చుట్టేసింది.

101 ప‌రుగుల‌కే చేతులెత్తేసింది. మ‌రో వైపు ఆండ్రూ ర‌స్సెల్ అద్భుత‌మైన షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడు. కానీ కేకేఆర్ కు ఫ‌లితం లేకుండా పోయింది.

16 పాయింట్లు సాధించి టాప్ లోకి దూసుకు వెళ్లింది. ల‌క్నో 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 176 ర‌న్స్ చేసింది(LSG vs KKR IPL 2022). ఇదిలా ఉండ‌గా ఇంకా 33 బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్నో స‌త్తా చాటింది.

ఓ వైపు గుజ‌రాత్ టైటాన్స్ సైతం ప్లే ఆఫ్స్ వెళ్ల‌డం దాదాపు ఖ‌రారైంది.

 

Also Read : రెచ్చి పోయిన క్వింట‌న్ డికాక్

Leave A Reply

Your Email Id will not be published!