LSG vs MI IPL 2023 Eliminator : ముంబై లక్నో సమరానికి సై
నిలిచేది ఎవరు గెలిచేది ఎవరో
LSG vs MI IPL 2023 Eliminator : ఐపీఎల్ 16వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి కీలక ఫలితం వచ్చేసింది. చెన్నై వేదికగా జరిగిన క్వాలిఫయర్ -1 లో బలమైన గుజరాత్ టైటాన్స్ ను 15 పరుగుల తేడాతో ఓడించింది ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ . దీంతో ఆ జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది.
పాయింట్ల పట్టికలో ఇక టాప్ లో కొనసాగుతూ వచ్చిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ కు మరోసారి ఛాన్స్ ఉంది. ఆ జట్టు గత ఏడాది ఛాంపియన్ గా నిలిచింది. వరుస విజయాలతో ఆకట్టుకున్నా ఉన్నట్టుండి చెన్నైతో చేతులెత్తేసింది. ధోనీ దెబ్బకు విలవిల లాడింది.
ఇక మరో కీలకమైన మ్యాచ్ జరగనుంది బుధవారం. మొదట్లో తడబడినా ఆ తర్వాత గెలుస్తూ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది రోహిత్ సేన నాయకత్వంలోని ముంబై ఇండియన్స్(MI). మరో వైపు కేఎల్ రాహుల్ గాయపడడంతో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఇవాళ తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే ఆ జట్టుతో గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్ -2 ఆడుతుంది.
ఈ మ్యాచ్ అన్నది అటు ముంబై కి ఇటు లక్నోకు అత్యంత కీలకం. దీంతో ఇరు జట్లు గెలుపు కోసం చివరి దాకా పోరాడేందుకు సిద్దమయ్యాయి. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో బలంగా ఉన్నాయి. ఇక ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు ఈ కీలక మ్యాచ్ కోసం.
Also Read : Tiger Global Invest