LSG vs RCB Eliminator : కొంప ముంచిన బౌలింగ్..ఫీల్డింగ్
లక్నో స్వయం కృతాపరాధం
LSG vs RCB Eliminator : కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ కోల్ కతా వేదికగా జరిగింది. ఈడెన్ మైదానంలో ఆద్యంతం నువ్వా నేనా అన్న రీతిలో
సాగింది మ్యాచ్. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(LSG vs RCB Eliminator) కు ఊహించని రీతిలో లక్ వరించింది.
20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 రన్స్ తో భారీ స్కోర్ సాధించింది. కానీ లక్నో(LSG vs RCB Eliminator) జట్ల ఆటగాళ్ల పేలవమైన ఫీల్డింగ్ ప్రదర్శన కారణంగా బెంగళూరు గట్టెక్కింది. ఒక రకంగా లక్నో స్వయం కృతాపరాధం అని చెప్పక తప్పదు.
ఆట పరంగా అద్భుతమైన ఫీల్డర్లుగా పేరొందారు ఇప్పటికే లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హూడా, ఇతర ఆటగాళ్లు. కానీ తక్కువ స్కోర్
లో ఉన్న సమయంలో సెంచరీతో రెచ్చి పోయి దంచి కొట్టిన రజత్ పాటిదార్ తక్కువ స్కోర్ ఉన్న సమయంలో హూడా చేతికి వచ్చిన బంతిని జార విడిచాడు.
ఇక టాప్ ఫినిషర్ గా పేరొందిన దినేష్ కార్తీక్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను జార విడిచాడు కేఎల్ రాహుల్. దీంతో కార్తీక్ 37 రన్స్ చేశాడు.
ఇక జాన్సన్ ను మేనేజ్ మెంట్ ఎందుకు పక్కన పెట్టిందో ఎవరికీ అర్థం కాలేదు.
అతడి స్థానంలో తీసుకున్న శ్రీలంక బౌలర్ చమీరా ఒక్క వికెట్ తీయక పోగా భారీ పరుగులు సమర్పించుకున్నాడు. రజత్ పటిదార్, దినేశ్ కార్తీక్ ఆఖరు 5 ఓవర్లలో 80 పరుగులు చేశారంటే అర్థం చేసుకోవచ్చు.
ఎంతటి విధ్వంసకరంగా పరుగులు చేశారో. మొహసిన్ 25 పరుగులు ఇస్తే, చమీరా 54 రన్స్ ఇచ్చాడు. కృనాల్ పాండ్యా 39 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
బిష్ణోయ్ 45 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మొత్తంగా పేలవమైన బౌలింగ్, ఫీల్డింగ్ తో మ్యాచ్ ను పోగొట్టుకుంది లక్నో.
Also Read : బెంగళూరు దెబ్బ లక్నో అబ్బా