SRH vs LSG IPL 2022 : కెప్టెన్ ను మార్చినా జట్టు తల రాత మారడం లేదు సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs LSG)కు. ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో పరాజయ పరంపర కొనసాగుతూనే ఉంది. ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో 12 రన్స్ తేడాతో మరో అపజయాన్ని మూట గట్టుకుంది.
చివరి వరకు విజయం ఊరించినా బ్యాటర్ల నిలకడ లేనితనం కొంప ముంచింది ఎస్ ఆర్ హెచ్ ను. టోర్నీ ప్రారంభమైనా ఇంకా బోణీ చేయలేదు. ఇక కీలక సమయంలో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ఆవేశ్ ఖాన్.
ఏకంగా మనోడు 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక జేసన్ హోల్డర్ సైతం సత్తా చాటాడు 34 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ పరంగా చూస్తే ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 50 బంతులు ఆడి 6 ఫోర్లు ఓ సిక్స్ తో 68 పరుగులు చేశాడు.
దీపక్ హూడా 33 బంతులు ఆడి 3 ఫోర్లు 3 సిక్సర్లతో 51 రన్స్ తో రాణించాడు. అనంతరం బరిలోకి దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులే చేసింది.
జట్టులో రాహుల్ త్రిపాఠి 30 బంతులు ఆడి 5 ఫోర్లు ఓ సిక్స్ 44 రన్స్ చేశాడు. చివరి వరకు చేసిన ప్రయత్నం హైదరాబాద్ ను గట్టెక్కించ లేక పోయింది.
ఇదిలా ఉండగా ఇవాళ మరో ఉత్కంఠ పోరుకు సిద్దమవుతున్నాయి ఆర్ఆర్, ఆర్సీబీ (SRH vs LSG)జట్లు.
Also Read : గెలిస్తే బెటర్ లేక పోతే కష్టం