DC vs LSG : ఐపీఎల్ 2022లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. లక్నో సూపర్ జెయింట్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చివరి వరకు నువ్వా నేనా అన్న రీతిలో బిగ్ ఫైట్ సాగింది.
అక్షర్ పటేల్ పోరాడినా ఫలితం దక్కలేదు. దురదృష్టం ఢిల్లీని వెంటాడింది. దీంతో లక్నో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
గత మ్యాచ్ లో విఫలమైన స్కిప్పర్ ఈసారి మ్యాచ్ లో సత్తా చాటాడు. ఇక 196 పరుగుల టార్గెట్ తో మైదానంలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 189 పరుగులకే పరిమితమైంది.
ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్ 44 రన్స్ చేస్తే అక్షర్ పటలే ఆఖరున దంచి కొట్టాడు. 42 రన్స్ చేశాడు. మిచెల్ మార్ష్ 37 పరుగులతో రాణించాడు. లక్నో బౌలర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
నాలుగు ఓవర్లు వేసి 4 వికెట్లు తీశాడు. చమీరా, గౌతమ్ , రవి బిష్నోయ్ చెరో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్(DC vs LSG) కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 195 రన్స్ చేసింది.
కేఎల్ రాహుల్ 77 పరుగులతో దుమ్ము రేపాడు. టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీపక్ హూడా 52 రన్స్ చేసి సత్తా చాటాడు. శార్దూల్ ఠాకూర్ ఒక్కడే ఢిల్లీ తరపున మూడు వికెట్లు తీశాడు.
ఇదిలా ఉండగా లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి దాకా 10 మ్యాచ్ లు ఆడి 7 మ్యాచ్ లలో గెలుపొందింది. మూడు మ్యాచ్ లలో ఓటమి పాలైంది.
Also Read : రవీంద్ర జడేజాపై పఠాన్ కామెంట్