PBKS vs LSG : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 2022లో కొత్తగా చేరిన గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్(PBKS vs LSG )దుమ్ము రేపుతున్నాయి. తమదైన రీతిలో సత్తా చాటుతున్నాయి.
నువ్వా నేనా అన్నంతగా సాగింది లీగ్ మ్యాచ్. ఈ కీలక పోరులో 20 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. పంజాబ్ బౌలర్లు తక్కువ స్కోర్ కే ప్రత్యర్థి జట్టును కట్టడి చేసినా బ్యాటర్లు చేతులెత్తేయడంతో చేజేతులారా ఓటమి మూటగట్టుకుంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన పంజాబ్ లక్నోను బ్యాటింగ్ కు దింపింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఐపీఎల్ లో రాణిస్తూ వస్తున్న లక్నో స్కిప్పర్ కేఎల్ రాహుల్ ఈసారి నిరావ పరిచాడు.
కేవలం 6 పరుగులకే చాప చుట్టేశాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన క్వింటన్ డికాక్ 37 బంతులు ఆడి 46 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. డికాక్ తో పాటు దీపక్ హుడా 28 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ ఒక సిక్స్ తో 34 రన్స్ చేశాడు.
పంజాబ్ కింగ్స్ జట్టులో కగిసో రబడకు 4 వికెట్లు తీశాడు. అనంతరం స్వల్ప లక్ష్యంతో మైదానంలోకి దిగినా ఆశించిన రీతిలో రాణించ లేక పోయింది పంజాబ్ కింగ్స్ . కేవలం 8 వికెట్లు కోల్పోయి 133 రన్స్ చేసింది.
ఇందులో జాన్ బెయిర్ స్టో 28 బంతులు ఆడి 32 రన్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. అతడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరోసారి తన బౌలింగ్ మ్యాజిక్ తో మరోసారి మ్యాజిక్ చేశాడు కృనాల్ పాండ్యా. అతడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.
Also Read : బెన్ స్టోక్స్ కు జో రూట్ అభినందన