Amit Mishra Record : మలింగను దాటేసిన మిశ్రా
40 ఏళ్లు 170 వికెట్లు తీసి రికార్డ్
Amit Mishra Record : ఐపీఎల్ 16వ సీజన్ లో అరుదైన ఘనత సాధించాడు లక్నో సూపర్ జెయింట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్ మిశ్రా(Amit Mishra Record) . ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా నిలిచాడు. మిశ్రా వయసు 40 ఏళ్లు. లక్నో సూపర్ జెయింట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక లీగ్ మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన లక్నో 108 పరుగులకే పరిమితమైంది. స్పిన్ అనుకూల పరిస్థితులను అమిత్ మిశ్రా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు.
4 ఓవర్లు వేసిన మిశ్రా 21 రన్స్ చేసి 2 వికెట్లు తీశాడు. సుయాష్ ప్రభుదేసాయి, ఆర్సీబీ స్కిప్పర్ ఫాఫ్ డు ప్లెసిస్ వికెట్లు తీశాడు. ఇప్పటి దాకా ఐపీఎల్ లో 160 మ్యాచ్ లు ఆడాడు. 23.75 సగటుతో 7.34 ఎకానమీ రేటుతో 172 వికెట్లు తీశాడు.
ఐపీఎల్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల పరంగా చూస్తే 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2023లో ఆరు మ్యాచ్ లు ఆడాడు. 18.16 సగటుతో 7.26 ఎకానమీ రేటుతో 6 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి దాకా ఐపీఎల్ లో టాప్ -5 వికెట్లు తీసిన బౌలర్లలో డ్వేన్ బ్రావో 183 వికెట్లు తీస్తే , యుజ్వేంద్ర చాహల్ 178 వికెట్లు , మిశ్రా , లసిత్ మలింగ 170 వికెట్లు, పీయూష్ చావ్లా 170 వికెట్లు తీశారు.
Also Read : రోహిత్ శర్మ ఔట్ నిజమే – ఐపీఎల్