Rinku Singh Super : ‘రింకూ’కు లక్నో జట్టు అభినందన
క్రీడా స్పూర్తిని చాటిన జెయింట్స్ టీమ్
Rinku Singh Super : ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 రన్స్ చేసింది. నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు సిక్సర్లతో హోరెత్తించాడు.
అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ చివరి బంతి దాకా పోరాడింది. ఒక రకంగా గెలుపు అంచుల దాకా వచ్చి బోల్తా పడింది. యూపీ కుర్రాడు(Rinku Singh) మరోసారి మెరిశాడు. తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. లక్నో ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేశాడు. అంతే కాదు ఫోర్లు, సిక్సర్లతో రెచ్చి పోయాడు. జెయింట్స్ జట్టు వెన్నులో వణుకు పుట్టించాడు. భయంకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. పూనకం వచ్చినట్లు చెలరేగాడు.
ఒకానొక దశలో లక్నో పూర్తి ఆధిపత్యంతో ఉండగా మైదానంలోకి వచ్చీ రావడంతోనే రింకూ సింగ్ పరుగుల వేట ప్రారంభించాడు. లక్నో బౌలర్లను చితక్కొట్టాడు. రింకూ సింగ్ 33 బంతుల్లో 67 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. జాసన్ రాయ్ 47 రన్స్ చేశాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. సిక్స్ కొట్టేందుకని వెళ్లి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం లక్నో జట్టు ఆటగాళ్లు రింకూ సింగ్ ను ప్రత్యేకంగా అభినందించారు.
Also Read : Rinku Singh