Lucknow Super Giants : ద‌ర్జాగా ప్లే ఆఫ్స్ కు చేరుకున్న ల‌క్నో

14 మ్యాచ్ లు 18 పాయింట్లు

Lucknow Super Giants : ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 2022 , 15వ సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. రిచ్ టోర్నీలో ప్ర‌ధాన‌మైనది ప్లే ఆఫ్స్ . గ‌త సీజ‌న్ లో 8 జ‌ట్లు ఆడితే ఈసారి రెండు కొత్త జ‌ట్లు గుజ‌రాత్ టైటాన్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చేరాయి.

ఊహించ‌ని రీతిలో 5 సార్లు ఛాంపియ‌న్ గా నిలిచిన రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని ముంబై ఇండియ‌న్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో లాస్ట్ లో నిలువ‌గా 4 సార్లు టైటిల్ గెలిచిన ధోనీ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ 8వ స్థానంతో స‌రి పెట్టుకుంది.

ఇక అంచ‌నాల‌కు అంద‌కుండా హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్న గుజ‌రాత్ టైటాన్స్ , కేఎల్ రాహుల్ నాయ‌కుడిగా ఉన్న

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (Lucknow Super Giants) అన్ని జ‌ట్ల కంటే ముందే ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి.

గుజ‌రాత్ ఇప్ప‌టి దాకా పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో ఉండ‌గా ల‌క్నో రెండో ప్లేస్ లో కొన‌సాగుతోంది. గుజ‌రాత్ 13 మ్యాచ్ లు ఆడింది. 10 మ్యాచ్ ల‌లో గెలుపొంది 20 పాయింట్లు సాధించింది.

ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇక ల‌క్నో 14 మ్యాచ్ లు పూర్త‌య్యాయి. 9 మ్యాచ్ ల‌లో గెలుపొంది 5 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది. 18 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో కొన‌సాగుతోంది.

ఇక మూడు, నాలుగో స్థానాల్లో ఏయే జ‌ట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయ‌నేది ఉత్కంఠ‌గా మారింది. మూడు నాలుగు స్థానాల కోసం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ పోటీ ప‌డుతున్నాయి.

మొత్తంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఉన్న ల‌క్నో సూప‌ర్ జెయొంట్స్(Lucknow Super Giants) సూప‌ర్ గా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.

Also Read : ఐదోసారి 500 ర‌న్స్ చేసిన రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!