DC vs LSG : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా ముంబైలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిన్న పాట్ కమిన్స్ తుగ్గు రేగ్గొడితే ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్(DC vs LSG )తరపున క్వింటన్ డికాక్ నిప్పులు చెరిగాడు.
ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో లక్నో ఢిల్లీపై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యంతో బరి లోకి దిగిన లక్నో 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది.
డికాక్ ఆకాశమే హద్దుగా చెల రేగాడు. ఏకంగా 80 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఆఖరున వచ్చిన కృనాల్ పాండ్యా 19 పరుగులు చేస్తే ఆయుష్ బదోని 10 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొడితే లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 24 పరుగులకే అవుట్ అయ్యాడు.
అంతకు ముందు రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC vs LSG )నిర్ణీత ఓవర్లలో 149 పరుగులు చేసింది మూడు వికెట్లు కోల్పోయి.
ఓపెనర్ పృథ్వీ షా 61 పరుగులు చేసి సత్తా చాటాడు. రిషబ్ పంత్ 38 రన్స్ చేస్తే సర్పరాజ్ ఖాన్ 35 పరుగులతో రాణించాడు. దీంతో లక్నో ఐపీఎల్ 2022లో సత్తా చాటుతూ ముందుకు వెళుతోంది.
Also Read : కమిన్స్ సెన్సేషన్ బాద్ షా డ్యాన్స్