Madhuri Dixit Flat : రూ. 48 కోట్ల‌తో మాధురీ దీక్షిత్ ఫ్లాట్

ఖ‌రీదైన భ‌వ‌నం కొనుగోలు చేసిన న‌టి

Madhuri Dixit Flat :  ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి మాధురీ దీక్షిత్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ఆమె ముంబైలోని సముద్ర తీరం ప‌క్క‌నే ఏకంగా రూ. 48 కోట్లతో అత్యంత ఖ‌రీదైన ఫ్లాట్ (అపార్ట్ మెంట్)ను(Madhuri Dixit Flat) కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ 5,384 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

ఈ కాస్ట్ లీ భ‌వ‌నం ముంబై లోని ఉన్న‌త స్థాయి లోయ‌ర్ ప‌రేల్ ప్రాంతంలోని విలాస వంత‌మైన భ‌వ‌న స‌ముదాయం లోని 53వ అంతుస్తులో ఉంది. దీనిని గ‌త నెల సెప్టెంబ‌ర్ 28న రిజిష్ట‌ర్ చేయించారు. మాధురీ దీక్షిత్ భారీ ఖ‌రీదు పెట్టి ఫ్లాట్ ను కొనుగోలు చేసిన‌ట్లు ఇండియా బుల్స్ బ్లూ వెల్ల‌డించింది.

ద‌క్షిణ ముంబై లోని వ‌ర్లీ లోని నివాస ప్రాప‌ర్టీ 10 ఎక‌రాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. అరేబియా స‌ముద్రం ప‌క్క‌నే ఉంది. ఇందులో అతి పెద్ద స్విమ్మింగ్

పూల్స్ , ఫుట్ బాల్ పిచ్ , జిమ్ , స్పా, క్ల‌బ్, మ‌రెన్నో అత్యాధునిక సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేశారు. మాధురీ దీక్షిత్ సెప్టెంబ‌ర్ లో సెల్ల‌ర్ కాలీస్ ల్యాండ్ డెవ‌ల‌ప్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తో సేల్ క‌న్వేయ‌న్స్ డీడ్ పై సంత‌కం చేసింది.

ఈ ఆస్తి కొనుగోలుకు సంబంధించి రూ. 2.40 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించింది. ఏడు కార్ పార్కింగ్ స్థ‌లాలతో ఉంది. ఇదిలా ఉండ‌గా మ‌హారాష్ట్ర‌లో ఒక

మ‌హిళ తాను స్వంతంగా ఇల్లు లేదా అపార్ట్ మెంట్ , విల్లా కొనుగోలు చేస్తే స్టాంప్ డ్యూటీలో ఒక శాతం రాయితీని అందిస్తారు.

ఈ ఫ్లాట్ కొనుగోలు పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మాధురీ దీక్షిత్(Madhuri Dixit Flat) కి ఒక శాతం రాయితీని ఇచ్చింది. 1990లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన న‌టుల్లో మాధురీ దీక్షిత్ ఒక‌రుగా ఉన్నారు. 1999లో డాక్ట‌ర్ శ్రీ‌రామ్ నేనేని పెళ్లి చేసుకున్నారు.

ఝ‌ల‌క్ దిఖ్లా జా 10 వంటి చిత్రాల‌లో న‌టించారు. రియాలిటీ షోస్ కు న్యాయ నిర్ణేత‌గా ప‌ని చేస్తూ బిజీగా ఉన్నారు. ది ఫేమ్ గేమ్ అనే వెబ్ సీరీస్ లో న‌టించారు.

Also Read : ప‌వ‌ర్ స్టార్ పై గాడ్ ఫాద‌ర్ కామెంట్

Leave A Reply

Your Email Id will not be published!