Madhya Pradesh CM Dance : మ‌ధ్యప్ర‌దేశ్ సీఎం డ్యాన్స్ అదుర్స్

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ముర్ము ఎంపికపై ఆనందం

Madhya Pradesh CM Dance : మ‌ధ్యప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఆయ‌న ఆనందం ప‌ట్ట‌లేక డ్యాన్స్ ల‌తో హోరెత్తించారు. ప్ర‌స్తుతం సీఎం చేసిన నృత్యానికి(Madhya Pradesh CM Dance) సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఇంత‌టి సంతోషాన్ని క‌లిగించిన వార్త ఏమిటంటే భార‌తీయ జ‌న‌తా పార్టీ తీసుకున్న నిర్ణ‌యం. భార‌త దేశంలోనే అత్యున్న‌త‌మైన ప‌ద‌వి ఏదైనా ఉందంటే అది రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి.

తాజాగా ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తిగా ఉన్న రామ్ నాథ్ కోవింద్ ప‌ద‌వీ కాలం ముగిసింది. ఆయ‌న స్థానంలో కొత్త‌గా రాష్ట్ర‌ప‌తిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ప్ర‌క‌టించింది.

దీంతో అధికార బీజేపీ ఎన్డీయే కూట‌మి నుంచి ఒడిశాకు చెందిన ఆదివాసీ బిడ్డ , మాజీ గ‌వ‌ర్న‌ర్ ద్రౌపది ముర్మును రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది.

ఇక విప‌క్షాల నుంచి ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ కేంద్ర మంత్రి, ప్ర‌స్తుత టీఎంసీ ఉపాధ్య‌క్షుడిగా ఉన్న య‌శ్వంత్ సిన్హాను ఎంపిక చేసింది.

దీంతో ఇరువురు ఉద్దండులే. ఒక‌రు క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి వ‌స్తే మ‌రొక‌రు ఐఏఎస్ గా ఎంపికై అపార‌మైన అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా ఉన్నారు.

ఇక బీజేపీ నేష‌న‌ల్ చీఫ్ జేపీ న‌డ్డా త‌మ అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్మును ప్ర‌క‌టించిన వెంట‌నే మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఆనందానికి ప‌ట్ట ప‌గ్గాలు లేకుండా పోయాయి. ఆయ‌న పార్టీ శ్రేణుల‌తో క‌లిసి సంబురాలు చేసుకున్నారు.

ఇదిలా ఉండ‌గా శుక్ర‌వారం రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం హాజ‌ర‌వుతున్నారు.

Also Read : ఆ ఎమ్మెల్యేలు గౌహ‌తిలో ఉన్న‌ట్లు తెలియ‌దు – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!