Madras Murder : సోని లివ్ లో జ‌ర్న‌లిస్ట్ మ‌ర్డ‌ర్ పై వెబ్ సీరీస్

1940లో బ్రిటిష్ ఇండియాలో జ‌రిగిన హ‌త్య

Madras Murder : ప్ర‌ముఖ ఎంట‌రైన్మెంట్ సంస్థ సోని లివ్ సంస్థ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఏఎల్ విజ‌య్ తో క‌లిసి సోమ‌వారం ది మ‌ద్రాస్ మర్డ‌ర్ ని డిక్లేర్ చేసింది.

డిజిట‌ల్ ప్లాట్ ఫార‌మ్ లో 1940 సంవ‌త్స‌రం బ్రిటీష్ ఇండియాలో జ‌రిగిన ఒక హ‌త్య కేసు ఆధారంగా రాబోయే వెబ్ సీరీస్ ను వెల్ల‌డించింది.

దీనికి మ‌ద్రాస్ మ‌ర్డ‌ర్ అని పేరు ఎట్టింది. ఈ సీరీస్ కు షో ర‌న్న‌ర్ గా ఏఎల్ విజ‌య్ నిర్వ‌హిస్తార‌ని పేర్కొంది. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఐబీ కార్తికేయ‌ర్ దీనిని నిర్మించారు.

ఈ వెబ్ సీరీస్ సినీ ప్ర‌ముఖుల గురించి అప‌కీర్తి క‌లిగించే క‌థ‌నాలు రాయ‌డం, హ‌త్య కేసులో త‌మిళ సినిమా మొద‌టి సూప‌ర్ స్టార్ ప్ర‌మేయం గురించి కూడా ఉంది.

ఎల్లో జ‌ర్న‌లిస్ట్ హ‌త్య చుట్టూ చెప్ప‌ని కుట్ర‌లు, ర‌హ‌స్యాల‌ను విప్పుతుంద‌ని సోని లివ్ స్ప‌ష్టం చేసింది. రాబోయే సీరీస్ గురించి ఏఎల్ విజ‌య్ స్పందించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ మద్రాస్ ప్రెసిడెన్సీలో జ‌రిగిన ఒక య‌ధార్ధ సంఘ‌ట‌ననే తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశామ‌న్నారు. అందుకే ది మ‌ద్రాస్ మ‌ర్డ‌ర్(Madras Murder) అని పేరు పెట్ట‌డం జ‌రిగింద‌ని తెలిపారు.

అత్యంత స‌వాలుతో కూడిన ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు ఇది అని స్ప‌ష్టం చేశారు. మ‌ద్రాస్ మ‌ర్డ‌ర్ తో అనుబంధం క‌లిగి ఉండ‌డం చాలా గొప్ప‌గా అనిపిస్తుంద‌న్నారు.

వీక్ష‌క‌కుల‌కు అద్భుత‌మైన అనుభ‌వాన్ని అందిస్తుంద‌న్నారు విజ‌య్. మా బృందం మొత్తం డిజిట‌ల్ స్క్రీన్ పై స్వాతంత్రానికి పూర్వపు యుగాన్ని పునః సృష్టి చేయ‌డంలో కృషి చేస్తుంద‌న్నారు విజ‌య్.

Also Read : విష్ణు విశాల్ న్యూడ్ ఫోటో షూట్

Leave A Reply

Your Email Id will not be published!