Srisailam Brahmotsavam : శ్రీ‌శైలంలో బ్ర‌హ్మోత్స‌వాలు షురూ

స్వామి, అమ్మ‌వార్ల‌కు టీటీటీ ప‌ట్టు వ‌స్త్రాలు

Srisailam Brahmotsavam : మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఆంధ్ర ప్ర‌దేశ్ లోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్రంగా వినుతికెక్కిన శ్రీ‌శైలంలో బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభమ‌య్యాయి(Srisailam Brahmotsavam). వేలాది మంది భ‌క్తులు శివ నామ స్మ‌ర‌ణ‌తో హోరెత్తి పోయింది. ఈనెల 21 వ‌ర‌కు ఈ ఉత్స‌వాలు కొన‌సాగనున్నాయి. శ్రీ మ‌ల్లికార్జున స్వామి, భ్ర‌మరాంబిక అమ్మ వారికి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

అంత‌కు ముందు స్వామి వార్ల‌కు శ్రీ‌కాళ‌హ‌స్తి దేవ‌స్థానం త‌ర‌పున వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఇది ప్ర‌తి ఏటా ఆన‌వాయితీగా వ‌స్తూ ఉన్న‌ది. దేశంలోని ప్ర‌ముఖ శైవ క్షేత్రాల‌లో శ్రీ‌శైలం ఒక‌టిగా భాసిల్లుతోంది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ స్వామి, అమ్మ‌వార్ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి హార‌తులు ఇచ్చారు. శ్రీ‌శైలం ఈవో ల‌వ‌న్న‌తో పాటు ఆల‌య చైర్మ‌న్ శ్రీ‌కాళ‌హ‌స్తి ఈవో విజ‌య సాగ‌ర్ బాబు శేష వ‌స్త్రాల‌తో స‌త్క‌రించారు. పుణ్య క్షేత్రంలో 11 రోజుల పాటు బ్ర‌హ్మోత్స‌వాలు కొన‌సాగనున్నాయి.

13న హంస వాహ‌న సేవ‌, 14న టీటీడీ ఆధ్వ‌ర్యంలో ప‌ట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌, 15న రావ‌ణ వాహ‌న సేవ‌, 17న గ‌జ వాహ‌న సేవ‌, 18న లింగోద్భ‌వంతో పాటు అర్ధ‌రాత్రి భ్ర‌మ‌రాంబ‌, మ‌ల్లికార్జున స్వామి క‌ళ్యాణోత్స‌వం జ‌రుగుతుంది. 19న ర‌థోత్స‌వం, 20న పూర్ణాహుతి, 21న చండీశ్వ‌ర పూజ‌, మండ‌పారాధ‌న‌, అర్చ‌న , పుష్పోత్స‌వం , శ‌య‌నోత్స‌వం, ఏకాంత సేవ‌తో బ్ర‌హ్మోత్స‌వాలు(Srisailam Brahmotsavam) కొన‌సాగుతాయి.

భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇప్ప‌టికే శ్రీ‌శైలం దేవ‌స్థానం తాగు నీరు, పారిశుధ్య సౌక‌ర్యాలు, అన్న‌దాన వ‌స‌తిని ఏర్పాటు చేసింది.

Also Read : విశ్వ శాంతి కోసం గీతా పారాయ‌ణం

Leave A Reply

Your Email Id will not be published!