Maha Shivaratri 2023 : శివరాత్రి పర్వదినం పోటెత్తిన భక్తజనం
దేశ వ్యాప్తంగా ఆలయాలు కిటకిట
Maha Shivaratri 2023 : మహా శివరాత్రి సందడి కొనసాగుతోంది. శనివారం శివరాత్రి పర్వదినం. లక్షలాది మంది భక్తులు శైవ పుణ్య క్షేత్రాలలో కొలువు తీరారు. భారీ ఎత్తున చేరుకుంటున్నారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలలో భక్తులు పోటెత్తారు.
ఎక్కడ చూసినా శివ నామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి ఆలయాలు. భక్త బాంధవులతో క్రిక్కిరిసి పోయాయి. అర్ధరాత్రి నుంచే పూజలు ప్రారంభమయ్యాయి. శివ, పార్వతులకు ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తున్నారు. మహా శివ రాత్రితో(Maha Shivaratri 2023) పాటు శని త్రయోదశి కావడంతో ఇసుకేస్తే రాలనంత భక్తులు నిండిపోయారు.
ఈ పర్వదినం రోజున శివుడిని దర్శించుకుంటే , పూజలు చేస్తే పుణ్యం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏపీలోని అమరావతి అమరేశ్వరాలయం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి శైవ క్షేత్రాలు శివ నామ స్మరణతో దద్దరిల్లాయి. గౌతమి గోదావరి లో పుణ్య స్నానాలు చేశారు భక్తులు. సామర్లకోట లోని భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో పూర్తిగా నిండి పోయింది. ఈ సందర్భంగా శేష వాహనం, నంది వాహనంపై శివుడు దర్శనం ఇవ్వనున్నారు.
ఇక తెలంగాణలోని శైవ ఆలయాలు సైతం భక్తులతో నిండి పోయాయి. ఎక్కడ చూసినా శివ భక్తుల శివ శివా అంటూ స్మరణతో దద్దరిల్లి పోయింది.
వేములాడ రాజన్న , కీసరగుట్ట, రామప్ప గుడి, చిన్న అనంతగిరి , తదితర ఆలయాలలో మహా శివ రాత్రి పర్వదినం సందర్భంగా పూజలతో నిండి పోయాయి. మహా శివరాత్రి(Maha Shivaratri 2023) పర్వదినం సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు అదనపు బస్సులు నడుపుతున్నాయి.
Also Read : వెరీ స్పెషల్ ‘భోళా శంకరుడు’ వైరల్