Mahesh Babu & Krishna : మీలాంటి వారు ఎవ‌రూ లేరు నాన్నా

కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్రిన్స్

Mahesh Babu & Krishna : మీరు నాకు తండ్రిగా ఉన్నందుకు గ‌ర్వంగా ఉంది. మీలాంటి వారు ఎవ‌రూ లేరు నాన్నా అంటూ భావోద్వేగంతో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు ప్ర‌ముఖ న‌టుడు ప్రిన్స్ మ‌హేష్ బాబు(Mahesh Babu & Krishna).

సోష‌ల్ మీడియాలో త‌న అనుభూతుల్ని పంచుకున్నారు. ఎంద‌రో న‌టులు ఉండ‌వ‌చ్చు. కానీ జీవిత‌మంతా మాన‌వ‌త్వాన్ని పంచుతూ ఉన్న నీలాంటి తండ్రి త‌న‌కు దొర‌క‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని తెలిపాడు.

ఎవ‌ర్ గ్రీన్ హీరో సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు ఇవాళ‌. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులు కృష్ణ‌కు హృద‌య పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలియ చేస్తున్నారు.

లెజెండ్ అభిమానుల ద‌ళంలో చేరిన కృష్ణ కుమారుడు , న‌టుడు మ‌హేష్ బాబు ప్ర‌త్యేక సంద‌ర్భంలో త‌న తండ్రికి ఇన్ స్టా గ్రామ్ ద్వారా పోస్ట చేశారు. ఈ పోస్ట్ ను ఆయ‌న‌కు అంకితం ఇచ్చారు.

తెలుగు సినిమా హార్ట్ త్రోబ్ త‌న తండ్రి ఫోటోను షేర్ చేశారు. పుట్టిన రోజు గ్రీటింగ్స్ నాన్నా. నీలాంటి వారు అరుదుగా ఉంటారు.

చాలా ఏళ్లు మీ ఆనందం, సంతోషం త‌న‌కు, ఫ్యామిలీకి పంచుతూనే ఉండాల‌ని కోరాడు మ‌హేష్ బాబు(Mahesh Babu & Krishna). కోడ‌లు న‌మ్ర‌తా శిరోద్క‌ర్ , పిల్ల‌లు సితార‌, గౌత‌మ్ కూడా కృష్ణ‌తో దిగిన ఫోటోల‌ను పంచుకున్నారు.

గ‌త కొన్నేళ్లుగా ప్రేమ‌, న‌వ్వు, ద‌య‌, ఆనందాన్ని తీసుకు వ‌చ్చేలా చేశారు. నేను ఎప్ప‌టికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేసుకుంటున్నాను అని పోస్ట్ చేసింది న‌మ్ర‌తా శిరోద్క‌ర్. ప్ర‌స్తుతం మ‌హేష్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Also Read : రెహ‌మాన్ స్వ‌రం వందేమాత‌రం

Leave A Reply

Your Email Id will not be published!