Mahila Panchayat : మహిళా రెజ్లర్ల పార్లమెంట్ మార్చ్
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ పై పోరు
Mahila Panchayat : తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ మహిళా(Mahila) రెజ్లర్లు చేస్తున్న పోరాటం మరింత ఉధృతం అవుతోంది. గత ఏప్రిల్ 23 నుంచి తమకు న్యాయం చేయాలంటూ నిరసన దీక్ష చేపట్టారు. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మే 28న ఆదివారం నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా దేశం కోసం క్రీడా పరంగా ఆడిన తమకు న్యాయం చేయాలని కోరుతూ శాంతియుత ర్యాలీ చేపట్టనున్నారు. ఈ విషయాన్ని మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్ , వినేష్ ఫోగట్ , బజరంగ్ పునియా వెల్లడించారు.
రెజ్లర్లు మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా ముందుకు వెళ్లకుండా ఎంతటి శక్తి అయినా తమను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. మాపై బలవంతంగా ప్రయోగించినా, వేధింపులకు గురి చేసినా మార్చ్ శాంతియుతంగా కొనసాగిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా కొత్త పార్లమెంట్ భవనం ముందు మహిళా మహా పంచాయత్ ను విరమించు కోవాలని చాలా ఒత్తిళ్లు వచ్చాయని కానీ తాము మార్చ్ తో ముందుకు వెళతామని ప్రకటించారు మహిళా రెజ్లర్లు.
జంతర్ మంతర్ నుంచి కొత్త పార్లమెంట్ భవనం వరకు మార్చ్ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మేమంతా మహిళా మహా పంచాయత్ తో ముందుకు వెళతామని చెప్పారు. ఏది వచ్చినా తమ మద్దతుదారులను అంబాలా లోని గురుద్వారా వద్ద నిలిపి వేశారంటూ ఆరోపించారు. ఇప్పుడు దానిని కంటోన్మెంట్ గా మార్చారంటూ ఆవేదన చెందారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను ఎవరు కాపాడుతున్నారో చెప్పాలన్నారు. ఆయన రాజీనామా చేసేంత దాకా తమ పోరు కొనసాగుతుందన్నారు.
Also Read : TDP Mahanadu
