Mahindra CEO : మూన్ లైటింగ్ కు మేం ఓకే – గుర్మానీ
మహీంద్రా ఉద్యోగులకు ఖుష్ కబర్
Mahindra CEO : ఓ వైపు మూన్ లైటింగ్ అనేది ఇప్పుడు ఐటీ , లాజిస్టిక్, ఫార్మా రంగాలకు చెందిన కంపెనీలలో హాట్ టాపిక్ గా మారింది. ఒక కంపెనీలో పని చేస్తూనే ఇంకో కంపెనీకి వర్క్ చేయడం అన్నది ఈ మధ్య పెరిగింది. దీనిని ముద్దుగా మూన్ లైటింగ్ అని పిలుస్తారు.
ప్రధానంగా ఈ మూన్ లైటింగ్ వ్యవహారం ఎక్కువగా ఐటీ రంగంలోనే ఎక్కువ. కరోనా ప్రపంచాన్ని కమ్మేసిన తరుణంలో కోట్లాది మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇదే క్రమంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో కంపెనీలు తమ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు వెసులుబాటు ఇచ్చాయి.
వేరే కంపెనీలలో చేసేందుకు ఓకే చెప్పాయి. కానీ ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎంప్లాయిస్ అంతా ఆఫీసులకు రావాలని, వర్క్ ఫ్రం హోం కు ఒప్పుకోమంటూ ప్రకటించాయి దిగ్గజ కంపెనీలు. ఇందులో ప్రధానంగా గూగల్, ఆపిల్ , ఫేస్ బుక్ (మెటా), ట్విట్టర్, అడోబ్, తదితర కంపెనీలు ఉన్నాయి.
కానీ చాలా మంది జాబ్స్ మానేస్తాం కానీ ఆఫీసులకు రామంటూ ఝలక్ ఇచ్చాయి. ఇదే సమయంలో ఈ సమస్య కొనసాగుతుండగానే ఇప్పుడు మరో సమస్య మూన్ లైటింగ్ చోటు చేసుకుంది.
మూన్ లైటింగ్ అంటే ఒక కంపెనీలో పని చేస్తూనే ఇంకో కంపెనీకి వర్క్ చేయడం. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఐటీ కంపెనీ మహీంద్రా గ్రూప్ ఐటీ కంపెనీ సిఇఓగుర్మానీ(Mahindra CEO) .
మూన్ లైటింగ్ పై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. కానీ ఒక షరతు మాత్రం విధించారు. అదేమిటంటే ఏ కంపెనీకి పని చేస్తున్నారో దాని వివరాలు, ఏ పని చేస్తున్నారనేది తెలియ చేయాలని కోరారు. అలా అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
Also Read : ప్లీజ్ మన్నించండి మళ్లీ రండి – మస్క్