Keshub Mahindra Died : కేషుబ్ మహీంద్రా కన్నుమూత
మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్
Keshub Mahindra Died : మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా(Keshub Mahindra Died) బుధవారం కన్ను మూశారు. ముంబై లోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 99 ఏళ్‌లు. 1947లో మహీంద్రా కంపెనీలో చేరారు. 1963లో చైర్మన్ అయ్యారు.
కేషుబ్ మహీంద్రా అక్టోబర్ 9, 1923లో సిమ్లాలో పుట్టారు. 48 ఏళ్ల పాటు మహీంద్రా గ్రూప్ కు నాయకత్వం వహించారు. ఆయన ఆగస్టు 2012లో చైర్మన్ గా పదవీ విరమణ చేశారు. ఆ పదవిని తన మేనల్లుడు ఆనంద్ మహీంద్రాకు అప్పగించారు.
ఫోర్బ్స్ ప్రకారం కేషుబ్ మహీంద్రా(Keshub Mahindra) తన సుదీర్ఘ కాలం పాటు చైర్మన్ గా ఉన్నారు కంపెనీకి. ఆయన హయాంలోనే మహీంద్రా గణనీయమైన మార్పులతో పాటు ఆదాయాన్ని గడించింది. విభిన్నమైన సమ్మేళనంగా మార్చారు.
మిత్సుబిషి, ఇంటర్నేషనల్ హార్వెస్టర్ , యునైటెడ్ టెక్నాలజీస్ , బ్రిటీష్ టెలికాం తో పాటు అనేక ఇతర గ్లోబల్ సంస్థలతో వ్యాపార సంబంధాలు నెలకొల్పడంలో కేషుబ్ మహీంద్రా చురుకైన పాత్ర పోషించారు.
అంతే కాదు $ 1.2 బిలియన్ల నికర విలువతో ఈనెల ప్రారంభంలో విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో అత్యంత పురాతన భారతీయ బిలియనీర్ గా గుర్తింపు పొందారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఏడుగురు మనవరాళ్లు ఉన్నారు. కేషుబ్ మహీంద్రా మృతి పట్ల వ్యాపారవేత్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : రైల్వేలపై గత పాలకుల నిర్లక్ష్యం