Priyanka Chopra : మహ్సా అమినీ మరణం బాధాకరం – ప్రియాంక
ఇరాన్ లో మిన్నంటిన నిరసనలు..ఆందోళనలు
Priyanka Chopra : హిజాబ్ ధరించ లేదన్న కారణంగా మహ్సా అమినీ లాకప్ డెత్ కు గురైంది. పోలీసుల దమనకాండపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ఇరాన్ లో చోటు చేసుకుంటున్నాయి. హిజాబ్ వ్యతిరేక నిరసనలపై ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) తీవ్రంగా స్పందించారు.
మహ్సా అమినీ మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. గత రెండు వారాలుగా వేలాది మంది ఇరానియన్లు , మహిళలు ఆందోళన బాట పట్టారు. ఇరాన్ లో కొనసాగుతున్న గందరగోళం మధ్య నటి ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. సెప్టెంబర్ 13న తన సోదరుడు, ఇతర బంధువులతో టెహ్రాన్ మెట్రో స్టేషన్ నుండి బయలు దేరుతుండగా మహ్సా అమినీని అరెస్ట్ చేశారు.
హిజాబ్ హెడ్ స్కార్ప్ (ముసుగు)లు , నిరాడంబరమైన దుస్తులు ధరించడంపై ఆమెను అరెస్ట్ చేశారు. మహ్సా అమినీ మూడు రోజుల పాటు కోమాలో ఉన్నారు. అమినీది అసహజ మరణం కాదని సహజ మరణమని పోలీసులు తర్వాత ప్రకటించారు. వారు చేసిన ప్రకటన మహిళలల్లో తీవ్ర ఆగ్రహావేశం వ్యక్తమైంది.
ఇరాన్ ప్రభుత్వంపై యుద్దం ప్రకటించారు. లాకప్ లో పోలీసుల దాడుల వల్లే చని పోయిందంటూ బాధిత మహిళలు ఆరోపించారు. మహ్సా అమినీ మరణానికి నిరసనగా 15 రోజులుగా ఇరానియన్లు వీధుల్లోకి వచ్చారు. ఈ తరుణంలో నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) మహ్సా అమినీకి పూర్తి మద్దతుగా నిలిచారు. ప్రపంచం పురోగమిస్తున్నా ఇంకా ఆదిమ కాలంలోనే ఉన్నామని పేర్కొన్నారు.
Also Read : ఎద అందాలను ఆరబోసి మత్తెక్కించిన కేతిక శర్మ