Anand Mahindra Kid : చిన్నారిని యుఎన్ రాయబారిగా చేయండి
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
Anand Mahindra Kid : ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. కోట్లాది మందిని ప్రభావితం చేసే ఏ అంశమైనా, వ్యక్తులైనా వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు.
అంతే కాదు తనకు నచ్చితే వెంటనే వారిని అభినందిస్తారు. ఆపై ప్రశంసలు కురిపిస్తారు. వీలైతే తన పరంగా సాయం చేసేందుకు సైతం వెనుకాడరు.
తాజాగా ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఓ చిన్నారి గురించి చేసిన తాజా ట్వీట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఒక చిన్న పిల్లాడు (సుమారు 4 ఏళ్లు కూడా ఉండవు) విమానం ఎక్కాడు. ఆపై వెళుతూ ప్రతి ఒక్కరినీ హాయ్ అంటూ పలకరిస్తూ వెళ్లాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేశాడు. ఆపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఈ పిల్లాడిని ఐక్య రాజ్య సమితికి శాంతి, సామరస్యత కోసం రాయబారిగా (అంబాసిడర్ ) నియమించాలని సూచించాడు. అంతే కాదు ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ (ప్రధాన కార్యదర్శి) ఆంటోనియో గుటెర్రస్ కు ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఒక అందమైన సందేశం కూడా పంపారు.
ప్రపంచం తరచుగా సంఘర్షణతో కూడుకున్నట్లు కనిపిస్తోంది. రష్యా సమీకరణ కష్టాలను మరింత పెంచుతోంది. కానీ ప్రపంచం ఎలా ఉండాలో మనకు ఎలా గుర్తు చేయాలో పిల్లలకు బాగా తెలుసు అని పేర్కొన్నారు.
ఈ పసి పిల్ల వాడిని శాంతి, సద్భావన కోసమైనా అంబాసిడర్ గా చేయాలని కోరారు ఆనంద్ మహీంద్రా. లక్షలాది మంది లైక్ చేశారు. వేలాది మంది రీట్వీట్ చేశారు. చాలా మంది షేర్ చేసుకున్నారు.
Also Read : కాలన్నీ కాసులతో కొలవకండి – సుందర్ పిచాయ్
The world often seems to be becoming more conflict-ridden. Russia’s mobilisation only adds to the woes. But Children know how to remind us of how the world SHOULD be. @antonioguterres should make this toddler a UN Ambassador for peace & goodwill! pic.twitter.com/AMECrbZGcX
— anand mahindra (@anandmahindra) September 24, 2022