ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన స్వస్థలం కన్నడ ప్రాంతం. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. తాను ఏఐసీసీ చీఫ్ గా ఎన్నికయ్యాక కర్ణాటకపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. భారీ ఎత్తున ప్రచారం చేపట్టారు. సుడిగాలి పర్యటన చేశారు. అన్నీ తానై వ్యవహరించారు. కేంద్రాన్ని, మోదీని, భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు.
మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు రణ్ దీప్ సూర్జేవాలా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మరో వైపు భారతీయ జనతా పార్టీ సైతం పోటా పోటీగా ప్రచారం చేసింది. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నీ తానై వ్యవహరించారు. అమిత్ షా , జేపీ నడ్డా అడపా దడపా మాత్రమే కనిపిచారు. ఇక బొమ్మై బొమ్మ లాగానే మారి పోయారంటూ ఆరోపించారు కాంగ్రెస్ నేతలు.
తాజాగా ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. మే 13న శనివారం ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. తాము పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీ వస్తుందని పేర్కొన్నారు.
