Mallikarjun Kharge : ఒప్పుకోన‌న్న ధ‌న్ ఖ‌ర్ త‌ప్ప‌ద‌న్న ఖ‌ర్గే

రాజ్య‌స‌భ చైర్మ‌న్ పై ప్ర‌తిప‌క్షాలు సీరియ‌స్

Mallikarjun Kharge : దేశంలోని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ తవాంగ్ స‌రిహ‌ద్దు ఘ‌ట‌న‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ కొన‌సాగుతోంది. ప్ర‌ధానంగా కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఈ త‌రుణంలో రాజ్య‌స‌భ‌లో మ‌రోసారి త‌వాంగ్ ఘ‌ట‌న‌పై చ‌ర్చ‌కు ప‌ట్టు ప‌ట్టాయి ప్ర‌తిప‌క్షాలు. వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద భార‌త్ , చైనా సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి డిసెంబ‌ర్ 9న వెలుగులోకి వ‌చ్చింది. దీనిని మీడియా బ‌య‌ట పెట్టింది. ఆ త‌ర్వాత భార‌త ఆర్మీ స్పందించింది. ఘ‌ర్ష‌ణ చోటు చేసుకున్న విష‌యం వాస్త‌వ‌మేన‌ని, కానీ భార‌త బ‌ల‌గాలు పెద్ద ఎత్తున తిప్పి కొట్టాయ‌ని స్ప‌ష్టం చేసింది.

దేశానికి సంబంధించి కీల‌క‌మైన అంశ‌మ‌ని, దానిపై చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కాంగ్రెస్ , టీఎంసీ , ఇత‌ర పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. దీనిపై రాజ్య‌స‌భ చైర్మ‌న్ , ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ ఒప్పుకోలేదు. దీనిపై ఇప్ప‌టికే కేంద్ర స‌ర్కార్ త‌ర‌పున క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశార‌ని తెలిపారు.

కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దేశం త‌ర‌పున కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇరు దేశాల మ‌ధ్య ప‌రిస్థితి ప్ర‌శాంతం ఉంద‌న్నారు. ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) సీరియ‌స్ గా స్పందించారు.

ఎందుకు అనుమ‌తి ఇవ్వ‌కూడ‌దంటూ ప్ర‌శ్నించారు. పూర్తిగా ప‌క్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఖ‌ర్గే.

Also Read : ప్రేమ కోసం మ‌ర‌ణిస్తున్నారు – సీజేఐ

Leave A Reply

Your Email Id will not be published!