Mallu Bhatti Vikramarka : పక్కదారి పట్టిన తెలంగాణ – భట్టి
సీఎల్పీ నేత విక్రమార్క
Mallu Bhatti Vikramarka : సీఎల్పీ నాయకుడు మల్లు విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం నడిచింది. ఎందరో బలిదానం చేసుకున్నారు. వారి కుటుంబాలను, నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని మేడం సోనియా గాంధీ తట్టుకోలేక తల్లడిల్లిందని, ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని అన్నారు. ఆదివారం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) మాట్లాడారు. కానీ ఏ ఆదర్శాల కోసమైతే పోరాడామో అవేవీ ఇవాళ నెరవేరిన దాఖలాలు లేవని ఆవేదన చెందారు భట్టి విక్రమార్క.
Mallu Bhatti Vikramarka Comments
ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు. ఇవాళ స్వేచ్ఛ, ఆత్మ గౌరవం లేకుండా పోయిందని వాపోయారు. సోనియా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కానీ కొలువు తీరిన సీఎం కేసీఆర్ అవేవీ నెరవేర్చిన పాపాన పోలేదన్నారు భట్టి విక్రమార్క. ఒక రకంగా చెప్పాలంటే ఆదర్శాలకు, లక్ష్యాలకు దూరంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ వెళుతోందని ఆరోపించారు.
రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. నిధుల మాట దేవుడెరుగు కనీసీం ఒకటో తేదీన జీతాలు ఇచ్చే స్థితిలో లేకుండా పోయిందని మండిపడ్డారు మల్లు భట్టి విక్రమార్క. ఇకనైనా సీఎం మారాలని, ప్రజలను మభ్య పెట్టడం మానుకోవాలని సూచించారు సీఎల్పీ నేత.
Also Read : Har Ghar Tiranga : అంతటా హర్ ఘర్ తిరంగా – మోదీ