Jailer 200 Cr : రూ. 220 కోట్లు దాటిన జైల‌ర్

వ‌సూళ్ల‌లో రికార్డుల మోత

Jailer 200 Cr : త‌మిళ సూప‌ర్ స్టార్ త‌లైవా ర‌జ‌నీకాంత్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ కూడా విడుద‌లైంది. కానీ భోళా శంక‌ర్ బాక్సాఫీసు వ‌ద్ద బోల్తా ప‌డితే ర‌జ‌నీకాంత్ మాత్రం జైల‌ర్(Jailer) మూవీతో దుమ్ము రేపాడు. త‌మిళ‌నాడులో ఏకంగా టాప్ లో నిలిచింది జైల‌ర్ క‌లెక్ష‌న్స్. ఆరంభంలో మిక్స్ డ్ టాక్ వ‌చ్చినా ఆ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ మేన‌రిజం, డైలాగులు, డ్యాన్సుల‌తో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సినిమాకు , ర‌జ‌నీ మేనియాకు ప‌డి పోయారు. విడుద‌లైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది జైల‌ర్ చిత్రం.

Jailer 200 Cr Club

ఇక కేవ‌లం మూడు రోజుల్లోనే ఈ సినిమా ఊహించ‌ని రీతిలో రూ. 200 కోట్ల క్ల‌బ్(Jailer 200 Cr) లోకి చేరి పోయింది. రికార్డ్ మోత మోగించింది. ఆగ‌స్టు 10న జైల‌ర్ విడుద‌లైంది. తొలి రోజు ఓవ‌రాల్ గా చూస్తే రూ. 95.78 కోట్లు, 2వ రోజు రూ. 56.24 కోట్లు, 3వ రోజు రూ. 68.51 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా కేవ‌లం 3 రోజుల్లో రూ. 220.53 కోట్లు క‌లెక్ష‌న్స్ సాధించి విస్తు పోయేలా చేసింది ట్రేడ్ పండితుల‌ను.

ఇదిలా ఉండ‌గా అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ అందించిన జైల‌ర్ లో ర‌జ‌నీకాంత్ , త‌మ‌న్నా భాటియా, శివ రాజ్ కుమార్, మోహ‌న్ లాలు, యోగి బాబు, ర‌మ్య కృష్ణ న‌టించారు.

Also Read : Mallu Bhatti Vikramarka : ప‌క్క‌దారి ప‌ట్టిన తెలంగాణ – భ‌ట్టి

Leave A Reply

Your Email Id will not be published!