Mamata Banerjee : నిన్నటి దాకా ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లారు. ఇక గవర్నర్ గా ధన్ కర్ పనికి రాడంటూ నిప్పులు చెరిగారు.
ఆయన ఫక్తు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తగా పని చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆపై ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో మితి మీరిన జోక్యం చేసుకుంటున్నారని, ఆయనను తప్పించాలని కోరారు.
ఈ మేరకు ఢిల్లీలో స్వయంగా సీఎంగా ఎన్నికైన అనంతరం సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee ) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. గవర్నర్ ను వెంటనే తప్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా విస్తు పోయేలా కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి బెంగాల్ లో . ఇక అసెంబ్లీలో బీజేపీ, టీఎంసీ ఎమ్మెల్యేల మధ్య కిష్కింద కాండ చోటు చేసుకుంది.
ఆ తర్వాత గవర్నర్ ట్విట్టర్ ఖాతాను బ్యాన్ చేసింది సీఎం దీదీ. ఇదే సమయంలో బెంగాల్ లోని భీర్బూమ్ సజీవ దహనం కేసు చర్చనీయాంశంగా మారింది.
దీనిపై విచారణకు రాష్ట్ర సర్కార్ సిట్ దాఖలు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ వద్దంటూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిని కొట్టి వేస్తూ కోల్ కతా కోర్టు తీర్పు చెప్పింది.
సీబీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తరుణంలో ఉప్పు నిప్పు లాగా ఉన్న సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee )గవర్నర్ జగదీప్ ధన్ కర్ లు ఇవాళ సర్ ప్రైజ్ ఇచ్చారు.
సీఎం గవర్నర్ తో ములాఖత్ అయిన విషయాన్ని గవర్నర్ కార్యాలయం గురువారం ట్విట్టర్ లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.
Also Read : ఆప్ ను నమ్మండి చాన్స్ ఇవ్వండి