Mamata Banerjee : ఎన్డీయేకు ‘ఇండియా’నే ప్రత్యామ్నాయం
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
Mamata Banerjee : టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షాల కూటమిలో ఆమె భాగస్వామిగా ఉన్నారు. విపక్షాలతో కొంత మేరకు వాదోపవాదాలు జరిగినా చివరకు అంతా ఒకే తాటిపైకి రావాలని నిర్ణయించారు. ఈ మేరకు పేరు కూడా ఖరారు చేశారు. ఇదిలా ఉండగా తొలి మీటింగ్ పాట్నాలో జరిగింది. రెండో మీటింగ్ సిమ్లాలో జరగాల్సి ఉండగా దానిని అనివార్య కారణాల రీత్యా బెంగళూరుకు మార్చారు.
Mamata Banerjee Said
మొత్తం 26 పార్టీలు పాల్గొన్నాయి. ఆయా పార్టీలకు చెందిన చీఫ్ లు, సీఎంలు, ఇతర హోదాలలో ఉన్న వారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee). విపక్షాల కూటమికి ఇండియా అని పేరు పెట్టడం జరిగిందన్నారు దీదీ. ఈ మేరకు ప్రస్తుతం కొలువు తీరిన ఎన్డీయే కు అసలైన , సిసలైన ప్రత్యామ్నాయం ఇండియానేనని స్పష్టం చేశారు సీఎం.
దేశంలో బీజేపీ నియంతృత్వ ధోరణితో వెళుతోందని, ప్రధాన మంత్రి తాను మాత్రమే ఉండాలని కోరుకుంటున్నాడని ప్రజలు ఎళ్లకాలం పట్టం కడతారని భావిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు సిద్దమై ఉన్నారని, వాళ్లు మార్పు కోరుకుంటున్నారని ఇదే కర్ణాటకలో వెల్లడైందని స్పష్టం చేశారు. విపక్షాల భేటీకి సంబంధించి బీహార్ సీఎంను తాను అభినందిస్తున్నట్లు చెప్పారు.
Also Read : Pawan Kalyan Fan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వైరల్