Mamata Banerjee : మహిళా రెజ్లర్లపై దాడి సిగ్గుచేటు
సీఎం మమతా బెనర్జీ కామెంట్స్
Mamata Banerjee : టీఎంసీ చీఫ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) నిప్పులు చెరిగారు. గురువారం ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశ రాజధానిలో శాంతియుతంగా దీక్ష చేపట్టిన మహిళా రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు అకారణంగా దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై తీవ్ర ఆరోపణలు చేసినా ఎందుకని కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాత్సారం వహిస్తున్నారంటూ ప్రశ్నించారు.
బేషరతుగా ఆరోపణలు వచ్చిన వెంటనే అతడిని తప్పించాలని స్పష్టం చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మంది రోడ్డు పైకి వచ్చారని కనీసం వాళ్ల గోస కూడా వినిపించుకునే స్థితిలో లేక పోవడం తనను బాధకు గురి చేసిందని వాపోయారు మమతా బెనర్జీ.
వాళ్లు నేరస్థులు కారు. అంతకన్నా ఎవరినీ మోసం చేయలేదు. నిరంతరం కష్టపడ్డారు. దేశం కోసం నిలబడ్డారు. తమ ప్రతిభా పాటవాలతో పతకాలు సాధించారు. జాతీయ పతాకం రెప రెపలాడేలా చేశారు. అలాంటి వారి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది అంటూ ప్రశ్నించారు సీఎం(Mamata Banerjee). దీనిని తాను ఖండిస్తున్నానని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తాను పూర్తిగా మహిళా రెజ్లర్లకు మద్దతు తెలియ చేస్తున్నానని ప్రకటించారు.
Also Read : మహిళా రెజ్లర్లపై దాడి దారుణం