Mamata Banerjee : కేజ్రీవాల్ కు మ‌మ‌తా బెన‌ర్జీ భ‌రోసా

బెంగాల్ సీఎంతో భేటీ

Mamata Banerjee : ఆప్ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మంగ‌ళ‌వారం ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee) తో భేటీ అయ్యారు. ఆయ‌న వెంట ఎంపీలు సంజ‌య్ సింగ్, రాఘ‌వ్ చ‌ద్దా, ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతిషి ఉన్నారు. ఈ సంద‌ర్భంగా కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ప్ర‌ధానంగా కేంద్రం బీజేపీయేత‌ర రాష్ట్రాలు, ప్ర‌భుత్వాల ప‌ట్ల అనుస‌రిస్తున్న వివ‌క్ష‌ను, క‌క్ష సాధింపు ధోర‌ణి గురించి ప్ర‌స్తావించారు.

ప్ర‌ధానంగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకు రావ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఢిల్లీ స‌ర్కార్ కు స‌ర్వాధికారాలు ఉంటాయ‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింద‌ని అయినా ఆద‌రా బాద‌రాగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకు వ‌చ్చింద‌ని ఈ సంద‌ర్భంగా అర‌వింద్ కేజ్రీవాల్ మ‌మ‌తా బెన‌ర్జీకి వివ‌రించారు. ప్ర‌స్తుతం లోక్ స‌భ‌లో ఆమోదం పొందినా రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొంద‌కుండా ఉండేందుకు త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

ఇందుకు సంబంధించి పూర్తి హామీ ఇచ్చేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు మ‌మ‌తా బెన‌ర్జీ. మ‌రో వైపు తీవ్రంగా వ్య‌తిరేకించే కాంగ్రెస్ పార్టీ సైతం ఆప్ స‌ర్కార్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ వెల్ల‌డించారు. ఈ త‌రుణంలో జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ సైతం కేజ్రీవాల్ కు వెన్ను ద‌న్నుగా నిలిచారు. బీజేపీయేత‌ర పార్టీల‌న్నీ ఈ ఆర్డినెన్స్ కు వ్య‌తిరేకంగా పోరాడాల‌ని పిలుపునిచ్చారు.

Also Read : Australian PM

Leave A Reply

Your Email Id will not be published!