Manda Krishna Comment : భావోద్వేగం పోరాటం చిరస్మరణీయం
మందకృష్ణ భావోద్వేగం
Manda Krishna Comment : తెలంగాణ గడ్డ పోరాటాల పురిటి గడ్డ. దీనికి ఘనమైన చరిత్ర ఉంది. అలుపెరుగని రీతిలో ఉద్యమించిన నేపథ్యం ఉంది. ఈ ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే. పాలకుల రాజ్యకాంక్ష, రాజకీయ నేతల ఆధిపత్య పోరు, దోపిడీకి గురైంది ఈ నేల. ఎందరో ఇక్కడ పుట్టిన వారు చిరునామా లేని చావులకు లోనయ్యారు. ఉద్యమానికి ఊపిరి పోసిన వాళ్లు నేటికీ ఆదర్శ ప్రాయంగా నిలిచారు. కవులు, కళాకారులు, గాయనీ గాయకులు, రచయితలు , మేధావులు, బుద్ది జీవులు స్పూర్తి దాయకంగా మారారు. ఈ దేశంలో జరిగిన ఫేక్ ఎన్ కౌంటర్లలో ఎక్కువగా ఎన్ కౌంటర్లకు గురైంది ఈ ప్రాంతానికి చెందిన వారే ఉండడం గమనించాల్సిన అంశం. ఇదే సమయంలో యువకులు ఎక్కువగా బుల్లెట్ల వర్షాలకు గురయ్యారు. ఇదే సమయంలో నిత్యం తుపాకుల నీడలో తెలంగాణ కొన్నేళ్ల పాటు కొనసాగింది.
Manda Krishna Comment Viral
దొరల గడీల పాలనలో తెలంగాణ బతుకు ఆగమైంది. ఎందరో బలిదానాలు, ఆత్మ హత్యలు చేసుకున్నారు. ముక్కు పచ్చలారని జీవితాలను పారేసుకున్నారు. సంబండ వర్ణాలు, బహజనులు , మైనార్టీలు పెద్ద ఎత్తున మూకుమ్మడిగా పోరాడినందు వల్లనే తెలంగాణ సాధ్యమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మరో ఎత్తు..మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ. అణగారిన, వెనుకబడిన మాదిగ కులాల జాతికి రిజర్వేషన్ కావాలని ఒకటా రెండా ఏకంగా 30 ఏళ్ల పాటు పోరాటం చేస్తూ వచ్చాడు. అన్ని పార్టీలను , సంఘాలను కలుసుకున్నాడు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ ప్రధాన అజెండాను తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. తాజాగా మందకృష్ణ(Manda Krishna) ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.
దీనికి కారణం ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ తమ డిమాండ్ ను అన్ని పార్టీల ముందు ఉంచారు. కానీ మందకృష్ణ(Manda Krishna) తీసుకు వచ్చిన డిమాండ్ ను కేంద్రంలో కొలువు తీరిన మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు మంద నేతృత్వంలో నిర్వహించిన మాదిగ విశ్వ రూప మహా సభకు లక్షలాది మంది జనం తరలి వచ్చారు. ఇక్కడికి వచ్చిన మాదిగ సోదర, సోదరీమణులను చూసి సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశ్చర్యానికి లోనయ్యారు. తను చేసిన పోరాటాన్ని చూసి, తనకు మద్దతు తెలిపిన అశేష మాదిగలను చూసి మందకృష్ణను ప్రశంసలతో ముంచెత్తారు.
తన సోదరుడు అంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఎన్నో పోరాటాలకు నేతృత్వం వహించిన , ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన పోరాట యోధుడిగా పేరొందిన మంద కృష్ణ మాదిగ ఉన్నట్టుండి లక్షలాది మంది సాక్షిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఏకంగా కంటతడి పెట్టారు. దీంతో మోదీ మందకృష్ణను ఓదార్చారు. తన జాతి కోసం నిబద్దతతో పోరాడిన యోధుడిగా చరిత్రలో నిలిచి పోతారని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.
Also Read : PM Modi : మందకృష్ణకు మోదీ కితాబు