DR Manik Saha : త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణం
రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా డాక్టర్
DR Manik Saha : త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ముఖ్యమంత్రి పదవికి బిప్లబ్ కుమార్ దేబ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో భారతీయ జనతా పార్టీ మాణిక్ సాహాను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.
అంతకు ముందు బిప్లబ్ దేబ్ గవర్నర్ కు రాజీనామా సమర్పించారు. దేబ్ తప్పుకున్న అనంతరం డాక్టర్ మాణిక్ సాహా ఒక రోజు అనంతరం 69 ఏళ్ల సాహాను బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా నియమించారు.
10వ సీఎంగా బిప్లబ్ దేబ్ ఉండగా 11వ సీఎంగా డాక్టర్ మాణిక్ సాహా(DR Manik Saha) ప్రమాణం చేశారు. ఆదివారం అగర్తల లోని రాజ్ భవన్ లో త్రిపుర బీజేపీ చీఫ్, రాజ్యసభ ఎంపీ మాణిక్ సాహా రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
డెంటల్ సర్జరీ ప్రొఫెసర్ గా పని చేశారు సాహా. ఈశాన్య రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా కీలక పాత్ర పోషించాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈశాన్య రాష్ట్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యత ఇప్పుడు సీఎంపై ఉంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరింత బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తానంటూ మాజీ సీఎం బిప్లబ్ దేబ్ చెప్పారు. ఈ ఆకస్మిక రాజకీయ పరిణామం రాష్ట్ర ప్రజలను ఒకింత విస్తు పోయేలా చేసింది.
2010లో డాక్టర్ మాణిక్ సాహా(DR Manik Saha) 2016లో కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. 2018లో ఆయన ఇన్ చార్జ్ గా ఉన్నారు.
Also Read : పార్లమెంటరీ బోర్డు పునరుద్దరిస్తారా