Manipur Violence Comment : ఇంకెంత కాలం ఈ మౌనం
మణిపూర్ దారుణాలపై నోరు విప్పరా
Manipur Violence Comment : పార్లమెంట్ స్తంభించింది మణిపూర్(Manipur) హింసోన్మాదంపై. బాధ్యత కలిగిన ప్రధాన మంత్రి చట్ట సభల్లోకి అడుగు పెట్టలేదు. వివరణ ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిసింది. కానీ ఏ ఒక్కరూ దారుణాల గురించి నోరు విప్పేందుకు సాహసించే ప్రయత్నం చేయలేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే నిండు సభలో అన్యాయం గురించి ప్రశ్నించే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందంటే అసలు ఈ దేశంలోనే ఉన్నామా అన్న అనుమానం కలుగుతోంది. మోదీ కొలువు తీరాక ఇలాంటి ఘటనలు కోకొల్లలు. కొన్ని బయటకు వచ్చినవి. మరొకొన్ని లెక్కలేనన్ని. లెక్కించ లేనన్ని. ఇవాళ ప్రతి సంఘటనకు , హింసకు మతం రంగు పూయడం అలవాటుగా మారింది. బలమైన వర్గం బలహీనమైన వర్గాలపై యధేశ్చగా దాడులకు దిగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి లేదా. ఒకవేళ కాదని అనుకుంటే గతంలో ప్రతి సందర్భంలో స్పందిస్తూనే వచ్చారు మోదీ.
Manipur Violence Comment For Support
గతంలో చాలా సార్లు ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ మే 3 నుంచి హింస, దాడులు, హత్యలు, అత్యాచారాలు, కాల్చి చంపడాలు, ఇళ్లను ధ్వంసం చేయడం మాత్రం పెద్ద ఎత్తున పెరిగాయి. ప్రభుత్వ సహకారం లేకుండా ఇలాంటివి జరుగతాయని అనుకోవడానికి వీలు లేదు. మందీ మార్బలం పిచ్చి పట్టినట్లు రోడ్లపై ఊరేగుతుంటే చూస్తూ ఊరుకుంటారా. ఇందుకేనా ఓట్లు వేసి గెలిపించింది. ఇందు కోసమేనా ఎన్నుకున్నది. ప్రజాస్వామ్యం చీకట్లో ఉంటే రాచరికం రావణ కాష్టాన్ని ప్రోత్సహిస్తుంది. చివరకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరిని చూసి భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించక పోతే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని, చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.
ఈ మధ్య కాలంలో ఇంతటి తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చిన దాఖలాలు అరుదు .గత కొంత కాలం నుంచి ప్రధాన మంత్రిని కలవాలని కోరాం. కానీ అపాయింట్ మెంట్ తమకు ఇవ్వలేదని వాపోయారు మణిపూర్ కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే హౌకిమ్. ఇది ఎంతటి బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక మణిపూర్(Manipur Violence Comment) లో ఇప్పటి దాకా వందల మంది చని పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. సైనికులు, బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ మొత్తం తతంగంపై పార్లమెంట్ సాక్షిగా విపక్షాల కూటమి ఇండియా సభ్యులు లేవదీసిన ప్రశ్నలకు బదులే ఇవ్వలేదు. సరికదా సస్పెన్షన్లతో సరిపుచ్చారు..ఇదేనా ప్రజాస్వామ్యం అంటే..ఈ దేశాన్ని రక్షించాల్సింది నాయకులు కాదు న్యాయ వ్యవస్థ మాత్రమేనని తేలి పోయింది. అవును..భరత మాత సిగ్గు పడుతోంది..కన్నీళ్లు కారుస్తోంది..దోసిళ్లు పడదాం రండి.
Also Read : Samudra Khani : పవన్ తో పని చేయడం అదృష్టం