Manipur Woman Parade Comment : భరతమాత కంటతడి
ఈ దారుణం ఇంకెంత కాలం
Manipur Woman Parade Comment : భరత మాత తల్లడిల్లుతోంది. రోజు రోజుకు అమానవీయ ఘటనలు భారతీయ సమాజాన్ని మరింత ఆందోళనకు గురయ్యేలా చేస్తున్నాయి. సభ్యత, సంస్కారం మరిచి పోయిన మానవ సమూహం పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తోంది. కులం, మతం, హింసోన్మాదం , విద్వేషం స్థాయిని దాటి మనుషుల్ని చిత్రహింసలకు గురి చేస్తోంది. మను ధర్మ శాస్త్రం మళ్లీ ప్రభావం చూపేందుకు రెడీ అవుతోంది. మణిపూర్(Manipur) లో చోటు చేసుకున్న ఘటన యావత్ భారతాన్ని నివ్వెర పోయేలా చేసింది. గత కొన్నేళ్లుగా దేశ మంతటా నిత్యం ఎక్కడో ఒకచోట దళితులు, ఆదివాసీలు, బహుజనులు, మైనార్టీలపై దాడుల పరంపర వరుసగా కొనసాగుతూ వస్తోంది. గుజరాత్ మారణ కాండ ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. సామూహిక అత్యాచారానికి గురైన బాధిత మహిళ బిల్కిస్ బానో కేసులో జీవిత ఖైదు కు గురైన నిందితులను నిస్సిగ్గుగా బీజేపీ ప్రభుత్వం బయటకు తీసుకు వచ్చింది. వారికి పూలదండలతో స్వాగతం పలికారు.
Manipur Woman Parade Comment to
ఈ ఘటన యావత్ భారతాన్ని విస్మయానికి గురి చేసింది. మోదీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా రాహుల్ గాంధీ పదే పదే ప్రశ్నిస్తూ, నిలదీస్తూ వచ్చారు. క్రీడా రంగానికి సంబంధించిన మహిళా రెజ్లర్లు తమపై లైంగిక వేధింపులకు పాల్పడున్నాడంటూ భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఆరోపణలు చేశారు. ఆందోళనకు దిగారు. కానీ చర్యలు లేవు. కోర్టు కూడా నిమ్మకుండి పోయింది ఈ విషయంలో. ఇలా చెప్పుకుంటూ పోతే దారుణాలు, హత్యలు, అవమానాలు లెక్కలేనన్ని ఉన్నాయి. తాజాగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మణిపూర్ లో చోటు చేసుకున్న ఘటన(Manipur Woman Parade). గత కొన్నేళ్లుగా అక్కడ జాతుల సమస్య కారణంగా రగులుతోంది. ఇప్పటి దాకా 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 50 వేల మందికి పైగా రాష్ట్రం విడిచి వలస బాట పట్టారు. ఇక్కడ కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిమ్మకుండి పోయింది. 10 వేలకు పైగా భద్రతా బలగాలు మోహరించాయి. సాక్షాత్తు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించినా ఫలితం లేక పోయింది. ఇదే క్రమంలో మానవ జాతి సిగ్గుపడేలా ఘోరం చోటు చేసుకుంది. మేటీలు కుకీ గ్రామంపై పడ్డారు. అడ్డం వచ్చిన వాళ్లను చంపారు. ఆడవాళ్లను కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించ లేదు. ఖాకీల గుంపును అడ్డుకున్నారు. ఆపై ముగ్గురు మహిళలను నగ్నంగా ఊరేగించారు. 2 కిలోమీటర్లు నడిపించుకుంటూ తీసుకు వెళ్లారు. పదుల సంఖ్యలో అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవలి కాలంలో దౌర్జన్యాలు, దాష్టీకాలు దారుణంగా పెరిగాయి. సుప్రీంకోర్టు(Supreme Court) సీజేఐ సీరియస్ అయ్యారు. సర్కార్ స్పందించక పోతే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. గోద్రా ఘటన రెండు వారాల్లో ముగిసి పోతే మణిపూర్ లో గత ఆరు నెలలుగా మండుతూనే ఉంది..కన్నీళ్లు కారుస్తూనే ఉంది..నగ్న దేహాల సాక్షిగా భరత మాత కన్నీరు కారుస్తోంది.
Also Read : Joseph Vijay Party : సెప్టెంబర్ లో తలపతి కొత్త పార్టీ ?