Manish Sisodia : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అయితే అక్కడ పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ గత కొంత కాలం నుంచీ ప్లాన్ చేస్తోంది.
ఇందులో భాగంగా ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో భారీ ర్యాలీలు చేపట్టారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలంటూ కోరారు.
కాగా ఆప్ హిమాచల్ ప్రదేశ్ చీఫ్ గా ఉన్న అనూప్ కేసరి ఉన్నట్టుండి తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ల సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
విచిత్రం ఏమిటంటే ఆయన ఎనిమిదేళ్ల పాటు ఆ రాష్ట్రంలో ఆప్ చీఫ్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా అనూప్ కేసరి బీజేపీలో చేరడంపై నిప్పులు చెరిగారు ఆప్ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia).
ఆయనను పూర్తిగా వ్యక్తిత్వం లేని వాడిగా పేర్కొన్నారు. ఆయన పార్టీని భ్రష్టు పట్టించాడంటూ ఆరోపించారు. మహిళల పట్ల ఆయన అగౌరవంగా మాట్లాడారని, అదే సమయంలో తాము పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అనుకున్నామని చెప్పారు.
ఇంత లోనే బీజేపీలోకి జంప్ అయ్యారంటూ ఎదురు దాడికి దిగారు సిసోడియా(Manish Sisodia). బీజేపీ ఒక పాత్ర లేని, వెన్నెముక లేని వ్యక్తిని ఎంచుకుందంటూ ఎద్దేవా చేశారు సిసోడియా.
అదే ఆయనకు సరైన స్థానం అంటూ పేర్కొన్నారు. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను చూసి బీజేపీ నాయకులు జడుసు కుంటున్నారంటూ జోష్యం చెప్పారు. ఎవరు వెళ్లినా ఆప్ కు ఏమీ కాదని అన్నారు.
Also Read : మోదీ సపోర్ట్ మరిచి పోలేను – గవర్నర్