Sanjay Manjrekar : భారత జట్టు స్టార్ ప్లేయర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్కిప్పర్ వికెట్ కీపర్ గా ఉన్న రిషబ్ పంత్ ప్రస్తుతం ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో సౌతాఫ్రికాతో కేప్ టౌన్ లో జరిగే మూడో టెస్టులో కొనసాగిస్తారా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది.
పంత్ ను తొలగించి వేరొకరిని ఆడించాలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) సంచలన కామెంట్స్ చేశారు.
ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ ఆటగాళ్లంతా ఎప్పుడో ఒకప్పుడు ఫామ్ లేమితో కొట్టుమిట్టాడిన వాళ్లేనని పేర్కొన్నాడు. ఇటీవల చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీ సైతం ఇబ్బంది పడ్డారంటూ గుర్తు చేశాడు.
ఇక పంత్ మరోసారి వికెట్ ను పారేసుకున్నాడు. రబాడా బౌలింగ్ లో ఆడకుండానే పెవిలియన్ చేరాడు. తీవ్ర వత్తిడికి లోనైన రిషబ్ పంత్ కు పూర్తి సపోర్ట్ గా నిలిచాడు సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar).
అద్భుతమైన ఆటగాడంటూ కితాబు ఇచ్చాడు. ఫామ్ లోకి వచ్చినా రాక పోయినా ఒక ఆటగాడిని ఒకటి రెండు మ్యాచ్ ల ఆధారంగా అతడు అద్భుతమైన ప్లేయరా కాదా అన్నది నిర్ణయించ లేమన్నాడు.
రిషబ్ పంత్ కు ఇంకా వయసేమీ అయి పోలేదని పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్ ఇలాంటి అసంబద్ద నిర్ణయం తీసుకోడనే తాను భావిస్తున్నట్లు తెలిపాడు.
పంత్ కెరీర్ లో ఇలాంటి షాట్స్ ఆడుతూ వస్తున్నాడని, ఇందులో అతడిని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నాడు సంజయ్ మంజ్రేకర్.
Also Read : పాయింట్ల పట్టికలో సఫారీ ముందంజ