Manoj Tiwary : భారతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీ ప్రస్తుతం ఎన్నడూ లేనంతగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ మెగా లీగ్ లో భారత్ దాయాది పాకిస్తాన్ జట్టుతో 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమి మూటగట్టుకుంది.
టైటిల్ హాట్ ఫెవరేట్ గా దిగిన మన జట్టు ఇదేనా అన్నంత దారుణంగా ఆడింది. ఇదే సమయంలో తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు కోహ్లీ. అతడికి కోలుకోని షాక్ ఇచ్చింది సెలక్షన్ కమిటీ.
ఇదే సమయంలో స్వదేశంలో కీవీస్ తో ఆడినా ఆ తర్వాత సఫారీ టూర్ లో బొక్క బోర్లా పడింది. ప్రధానంగా మూడు వన్డేలను కోల్పోయింది. ఆ తర్వాత సెంచూరియన్ వేదికగా గెలిచినా మిగతా రెండు టెస్టుల్ని 7 వికెట్ల తేడాతో పరాజయం మూటగట్టుకుంది.
దీంతో వన్డే, టెస్టు సీరీస్ లు కోల్పోయి తాజా, మాజా ఆటగాళ్ల విమర్శలను ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో మాజీ భారత క్రికెట్ ఆటగాడు, ప్రస్తుత బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ (Manoj Tiwary )సంచలన కామెంట్స్ చేశాడు.
అసలు సెలెక్షన్ కమిటీ ఏం చేస్తోందంటూ ప్రశ్నించాడు. నిద్ర పోతోందేమోనన్న అనుమానం తనకు కలుగుతోందన్నాడు. ప్రధానంగా కేఎల్ రాహుల్ ను టార్గెట్ చేశాడు.
అతడికి ఏం అనుభవం ఉందంటూ ఎంపిక చేశారంటూ నిలదీశాడు. ఒక జట్టుకు నాయకత్వం వహించాలంటే కనీసం 20 నుంచి 25 మ్యాచ్ లకు నాయకుడిగా పని చేసిన అనుభవం ఉండాలన్నాడు.
ఐపీఎల్ లో వ్యక్తిగతంగా రాణించినా కెప్టెన్ గా ఫెయిల్ అయ్యాడని మండిపడ్డాడు. మొత్తంగా జట్టు కూర్పు బాగా లేదని అందువల్లనే టీమిండియా సఫారీ టూర్ లో ఘోరంగా ఓడి పోయిందన్నాడు తివారి.
Also Read : అయ్యర్ అవుట్ బిష్ణోయ్ కు ఛాన్స్