Mansoor Ali Khan : క‌మిష‌న్ క‌న్నెర్ర ‘ఖాన్’ గాయ‌బ్

న‌టి త్రిష‌పై అనుచిత కామెంట్స్

Mansoor Ali Khan : త‌మిళ‌నాడు సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్ గాయ‌బ్ అయ్యాడు. ఆయ‌న అజ్ఞాతంలోకి వెళ్లి పోయిన‌ట్లు టాక్. న‌టుడిగా మార్కులు సంపాదించుకున్నా త‌ను ఇటీవ‌ల న‌టి త్రిష కృష్ణ‌న్ ప‌ట్ల అనుచిత కామెంట్స్ చేశాడు. ద‌ళ‌ప‌తి విజ‌య్ తో పాటు త్రిష క‌లిసి లియో మూవీలో న‌టించారు. ఇందులో కీల‌క పాత్ర‌లో మ‌న్సూర్ అలీ ఖాన్ కూడా క‌నిపించాడు. ఈ సినిమా షూటింగ్ ను కొంత జ‌మ్మూ కాశ్మీర్ లో చిత్రీక‌రించారు.

Mansoor Ali Khan Comments Issue Viral

అయితే సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. త‌న‌కు ద‌ర్శ‌కుడు త్రిష‌తో ఓ బెడ్ సీన్ లేదా రేప్ సీన్ ఉండేలా చేస్తాడ‌ని అనుకున్నాన‌ని కానీ అలాంటి రేప్ సీన్ లేకుండా చేశాడంటూ వాపోయాడు. ఈ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. క‌నీసం క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పేందుకు నిరాక‌రించాడు.

దీంతో ఆయ‌న చేసిన కామెంట్స్ ను సీరియ‌స్ గా తీసుకుంది జాతీయ మ‌హిళా క‌మిష‌న్. ఈ మేర‌కు వెంట‌నే మ‌న్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) పై కేసులు న‌మోదు చేయాల‌ని, అరెస్ట్ చేయాల‌ని ఆదేశించింది. దీంతో త‌మిళ‌నాడు పోలీసులు కేసు న‌మోదు చేశారు. ముంద‌స్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నా కోర్టు ఒప్పుకోలేదు. దీంతో అరెస్ట్ చేస్తారేమోన‌ని జంప్ అయ్యాడు న‌టుడు.

Also Read : Barrelakka Security : బ‌ర్రెల‌క్క‌కు హైకోర్టు భ‌రోసా

Leave A Reply

Your Email Id will not be published!